Share News

Mass Stabbing: రెచ్చిపోయిన సైకో.. సూపర్ మార్కెట్‌లోని జనంపై కత్తి దాడి

ABN , Publish Date - Jul 27 , 2025 | 08:59 PM

Mass Stabbing: ఏమైందో ఏమో తెలీదు కానీ, ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో అక్కడున్న వారిపై దాడి చేయటం మొదలెట్టాడు. చేతికి అందిన వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.

Mass Stabbing: రెచ్చిపోయిన సైకో.. సూపర్ మార్కెట్‌లోని జనంపై కత్తి దాడి
Mass Stabbing

వాల్‌మార్ట్ సూపర్ మార్కెట్‌లో సైకో దారుణానికి ఒడిగట్టాడు. సరుకులు కొనడానికి వచ్చిన వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మొత్తం 11 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సంఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో శనివారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ట్రావర్స్ సిటీలో వాల్‌మార్ట్ సూపర్ మార్కెట్ ఉంది. శనివారం పెద్ద సంఖ్యలో జనం మార్కెట్‌కు వచ్చారు.


తమకు అవసరమైన సరుకులు తీసుకోవటంలో బిజీ అయిపోయారు. ఇలాంటి సమయంలో.. ఏమైందో ఏమో తెలీదు కానీ, ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో అక్కడున్న వారిపై దాడి చేయటం మొదలెట్టాడు. చేతికి అందిన వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం సైకో అక్కడినుంచి పారిపోయాడు. ఇక, గాయపడ్డ వారిని అక్కడే ఉన్న వారు వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.


ప్రస్తుతం వారు నార్తర్న్ మిచిగాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అతి తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. ట్రావర్స్ సిటీకి 25 మైళ్ల దూరంలో ఉండే హానర్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల టిఫనీ డిఫెల్ సంఘటనపై మాట్లాడుతూ.. ‘దారుణం జరిగిన సమయంలో నేను పార్కింగ్ ప్లేస్‌లో ఉన్నా. అది చాలా భయంకరమైన పరిస్థితి. నేను, నా సోదరి గజగజ వణికిపోయాము’ అంటూ వాపోయింది.


ఇవి కూడా చదవండి

మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..

ఈ ఒక్క జ్యూస్‌తో గుండె జబ్బులన్నీ మాయం..

Updated Date - Jul 27 , 2025 | 09:03 PM