Share News

Malaysia to Ban Social Media: మలేషియాలో పిల్లలకు సోషల్‌ మీడియాపై నిషేధం

ABN , Publish Date - Nov 25 , 2025 | 03:54 AM

పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.....

Malaysia to Ban Social Media: మలేషియాలో పిల్లలకు సోషల్‌ మీడియాపై నిషేధం

కౌలాలాంపుర్‌(మలేషియా), నవంబరు 24: పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు మలేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్‌ మీడియాను వినియోగించకుండా నిషేధం విధించనుంది. ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కమ్యూనికేషన్‌ శాఖ మంత్రి ఫాహ్మి ఫడ్జిల్‌ తెలిపారు. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాల నుంచి పిల్లల్ని కాపాడేందుకు.. అస్ట్రేలియా, డెన్మార్క్‌, నార్వే వంటి దేశాలు ఇప్పటికే ఈ తరహా బ్యాన్‌ను అమలులోకి తేవాలని పరిశీలిస్తున్నాయి. వయసు ఽధ్రువీకరణ కోసం ఆయా దేశాలు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 03:54 AM