Share News

Canada lottery: ప్రియుడి లాటరీ సొమ్ము 30 కోట్లతో ప్రియురాలు పరారీ

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:41 AM

లాటరీలో రూ.30 కోట్లు గెలిచిన కెనడా వ్యక్తి, ప్రియురాలి చేతిలో మోసపోయాడు. తన ఖాతాలో బహుమతి డబ్బు జమచేసుకున్న ఆమె, మరో వ్యక్తితో పరారైంది.

Canada lottery: ప్రియుడి లాటరీ సొమ్ము 30 కోట్లతో ప్రియురాలు పరారీ

కొత్త ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ

కెనడా, జూన్‌ 1: కెనడాకు చెందిన ఓ వ్యక్తి లాటరీలో జాక్‌పాట్‌ కొట్టాడు. 3.6 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపుగా రూ.30 కోట్లు గెలిచాడు. కానీ, ఏం లాభం.. ఆ డబ్బుతోపాటు ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని ఒకేసారి కోల్పోయాడు. ఆ ప్రియురాలేం చనిపోలేదు.. ఉన్న ప్రియుడికి హ్యాండిచ్చి ఆ రూ.30 కోట్లు తీసుకుని కొత్త ప్రియుడితో చెక్కేసింది. దీంతో ప్రియురాలి అసలు రంగు బయటపడగా లబోదిబోమంటున్న బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనను మోసం చేసిన మహిళ నుంచి తన డబ్బు తనకి ఇప్పించమని కోరాడు. కెనడాలోని వెన్నిపెగ్‌కు చెందిన లారెన్స్‌ కాంపెల్‌ 2024లో కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.30 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. గుర్తింపు వివరాలు, బ్యాంకు ఖాతా లేకపోవడంతో లారెన్స్‌.. లాటరీ సంస్థ సూచనల మేరకు బహుమతి సొమ్మును ఏడాదిన్నరగా తనతో కలిసి ఉంటున్న ప్రియురాలు మెక్‌కే ఖాతాలో జమ చేయించాడు. ఆ తర్వాత ఆమె మొత్తం డబ్బు తీసుకుని మరొక ప్రియుడితో పరారైంది.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 05:41 AM