Israel Urges India: హమాస్‌ను ఉగ్రవాదసంస్థగా ప్రకటించండి!
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:03 AM
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. భారత్‌లో పలు ఉగ్ర దాడులకు కారణమైన పాకిస్థాన్‌కు చెందిన లష్కరే ....
భారత్‌కు ఇజ్రాయెల్ విజ్ఞప్తి
జెరూసలేం, డిసెంబరు 8: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. భారత్‌లో పలు ఉగ్ర దాడులకు కారణమైన పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తాయిబాను తాము 2023లోనే టెర్రరిస్టు సంస్థగా గుర్తిస్తూ నిషేధించామని, ఇప్పుడు భారత్ నుంచి అదే రకమైన స్పందనను కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘హమా్‌సకు లష్కరే తాయిబాతోపాటు పలు ఇరాన్ ప్రాయోజిత మిలిటెంట్ గ్రూపులతో సాన్నిహితం పెరుగుతోంది. దీనివల్ల భారత్, ఇజ్రాయెల్‌లకు భద్రతాపరంగా ముప్పు రోజురోజుకూ అధికమవుతోంది’ అని తెలిపారు. కాగా, ఇదే అంశంపై ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ నాదవ్ షోషనీ స్పందిస్తూ.. హమా్‌సను భారత్ టెర్రరిస్టు సంస్థగా ప్రకటిస్తే, ఇరు దేశాలకూ ఒకే ఉమ్మడి శత్రువు ఉన్నట్లుగా స్పష్టమవుతుందని, హమాస్ పట్ల భారత్ వైఖరి ఏమిటన్నది ప్రపంచానికి తెలుస్తుందని వివరించారు.