Humanitarian Aid: గాజాలో మానవతా సాయానికి ఇజ్రాయెల్ ఓకే
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:15 AM
ప్రపంచ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో గాజాలో ఇజ్రాయెల్ మానవతా సాయం అందించడానికి అడ్డంకులు కొంతమేర తొలగించింది.
గాజా, టెల్ అవీవ్, జూలై 27: ప్రపంచ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో గాజాలో ఇజ్రాయెల్ మానవతా సాయం అందించడానికి అడ్డంకులు కొంతమేర తొలగించింది. మళ్లీ ప్రకటించే వరకు రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు గాజాతోపాటు అల్ మవాసి, డెయిర్ అల్‌బలా ప్రాంతాల్లో సైనిక చర్యలు చేపట్టబోమని ప్రకటించింది. ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 53 మంది మృతిచెందారని గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా హమాస్ మాజీ చీఫ్ యహ్యా సిన్వర్ హతమవడంతో ఆయన భార్య సమర్ ముహమ్మద్ అబూ జమర్ గాజా నుంచి తుర్కియేకు పారిపోయి మరో వివాహం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ వార్తా సంస్థ వైనెట్ తెలిపింది. గతేడాది అక్టోబరు 16న ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో సిన్వర్ ప్రాణాలు కోల్పోవడంతో జమర్ ఫోర్జరీ పాస్‌పోర్టులతో పిల్లలతోసహా తుర్కియేకు పారిపోయారు.