Share News

Former CIA officer Richard Barlow: పాక్‌ అణు కేంద్రంపై దాడికి ఇందిర ఒప్పుకోలేదు

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:18 AM

అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఐఏ) మాజీ అధికారి రిచర్డ్‌ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ దశకంలో పాకిస్థాన్‌లోని కహుతా అణు కేంద్రంపై భారత్‌..

Former CIA officer Richard Barlow: పాక్‌ అణు కేంద్రంపై దాడికి ఇందిర ఒప్పుకోలేదు

  • సీఐఏ మాజీ అధికారి బార్లో వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబరు 8: అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఐఏ) మాజీ అధికారి రిచర్డ్‌ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ దశకంలో పాకిస్థాన్‌లోని కహుతా అణు కేంద్రంపై భారత్‌, ఇజ్రాయెల్‌ సంయుక్త ఆపరేషన్‌ ప్రతిపాదనను నాటి ప్రధాని ఇందిర అంగీకరించలేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం సిగ్గుచేటు అని అన్నారు. అదే ఆ మిషన్‌ జరిగి ఉంటే.. అనేక ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించేదని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ బార్లో వ్యాఖ్యానించారు. 1982, 1985 మధ్య తాను అమెరికా ప్రభుత్వ సేవలకు దూరంగా ఉన్న సమయంలో ఈ ప్రణాళిక గురించి విన్నట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్‌ తన అణు కార్యక్రమంలో అమెరికా జోక్యం చేసుకోకుండా ఉండేందుకు, అఫ్ఘానిస్థాన్‌లో తన సహకారాన్ని ఉపయోగించుకుందని బార్లో పేర్కొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 01:18 AM