Indias Russian Oil Imports: రష్యా చమురు దిగుమతులు పైపైకి!
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:43 AM
రష్యా చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే అంశంలో భారత్ వెనక్కి తగ్గడం లేదు...
అమెరికా ఆంక్షలను లెక్కచేయని భారత్
న్యూఢిల్లీ, డిసెంబరు 11: రష్యా చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే అంశంలో భారత్ వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటిలానే రష్యా చమురును పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. డిసెంబరులో సగటున రోజుకు 18.5 లక్షల చమురు బ్యారెళ్లను దిగుమతి చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఈ దిగుమతులు ఆరు నెలల గరిష్ఠానికి చేరనున్నాయి. కమోడిటీ ఎనలిస్ట్ కెప్లర్ ఈ మేరకు అంచనా వేసింది. కెప్లర్ నివేదిక ప్రకారం.. భారత్ అక్టోబరు నెలలో రోజుకు సగటున 14.8 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. నవంబరులో ఆ సంఖ్య 18.3 లక్షల బ్యారెళ్లకు పెరిగింది. డిసెంబరులో ఆ సంఖ్య 18.5 లక్షల బ్యారెళ్లకు చేరే అవకాశం ఉంది. 2025 జూన్ తర్వాత ఇదే అత్యధికం. ఈ ఏడాది జూన్‌లో భారత్ రోజుకు 21లక్షల చమురు బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది.