Cash Gold: 27 ఏళ్ల వ్యక్తి సూట్ కేస్‌లో బంగారు ఇటుకలు, 17 కోట్ల క్యాష్
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:57 PM
చూడగానే కళ్లు జిగేల్ మనేలా తళతళ మెరుస్తూ పచ్చని పసుపు రంగులో బంగారు ఇటుకలు, డబ్బుల కట్టలు.. అదీ డాలర్లు. 27ఏళ్ల భారతదేశ పౌరుడు తరలిస్తూ ఉంటే.. అది చూసిన ఎయిర్ పోర్ట్ తనిఖీ అధికార్లకు..
Cash and Gold: ఒక 27 ఏళ్ల భారతీయుడి దగ్గర్నుంచి కోట్ల కొలదీ డాలర్ల డబ్బు కట్టలు, చిన్న సైజు బంగారు ఇటుకలు బయల్పడ్డాయి. జాంబియా దేశ రాజధాని అయిన లుసాకా ఎయిర్ పోర్ట్‌లో ఈ కళ్లు చెదిరే సంపద బయటపడింది. స్థానిక కెన్నెత్ కౌండా అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహిస్తోన్న తనిఖీల్లో సదరు భారతీయ యువకుడి దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. జాంబియా దేశంలోని ప్రధాన విమానాశ్రయం అయిన లుసాకా ఎయిర్ పోర్ట్ ద్వారా $2 మిలియన్లకు పైగా (రూ.17,07,74,505) నగదు, $500,000 విలువైన బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన భారతీయుడిని అరెస్టు చేసినట్లు జాంబియన్ కస్టమ్స్ అధికారులు శనివారం తెలిపారు.

27 ఏళ్ల వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌కు వెళుతుండగా, స్థానిక కెన్నెత్ కౌండా అంతర్జాతీయ విమానాశ్రయంలో మల్టీ ఏజెన్సీ టీం అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషన్ (DEC) తెలిపింది. అతని వద్ద ఉన్న $2,320,000 నగదు, $500,000 విలువైన ఏడు బంగారం దిమ్మలను అడ్డుకున్నట్లు ఏజెన్సీ ఆ ప్రకటనలో వెల్లడించింది. జాంబియా మీడియా షేర్ చేసిన సదరు చిత్రాల్లో రబ్బరు బ్యాండ్‌లతో వంద డాలర్ల($100) నోట్లు.. కట్టకు వంద చొప్పున కట్టలుగా ఉన్నాయి. డబ్బును ఒక నల్ల సంచిలో ప్యాక్ చేసి, ఆపై పెద్ద పాలీప్రొఫైలిన్ సూట్‌కేస్‌లో ఉంచారు.

"ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది," అని DEC పేర్కొంది. "చట్టం ఈ వ్యవహారాన్ని త్వరలోనే నిగ్గుతేల్చుతుంది" అని డిఇసి చెప్పింది. సదరన్ ఆఫ్రికా దేశం అయిన జాంబియా ఎయిర్ పోర్ట్‌లలో ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇలా ఉంటే, రాగి, బంగారు ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ జాంబియా దేశ ఆర్థిక వ్యవస్థ పేదరికంలోనే ఉంది. అక్కడి జనాభా 60 శాతం కంటే ఎక్కువ మంది పేదరికంలో జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయి.

ఇలాగే, 2023న జాంబియాలో ఆయుధాలు 127 కిలోగ్రాములు (280 పౌండ్లు), బంగారం, $5.7 మిలియన్ల నగదుతో వెళ్తున్న నలుగుర్ని అరెస్టు చేశారు. ప్రాసిక్యూటర్లు వారిపై గూఢచర్యం ఆరోపణలను ఉపసంహరించుకున్న తర్వాత వారిని విడుదల చేశారు.

Read Also: Optical Illusion Test: మీ కళ్లకు పరీక్ష.. జిరాఫీల మధ్యనున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి
Picture Puzzle: మీ అబ్జర్వేషన్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 15 సెకెన్లలో కనుక్కోండి...
120 Year Old: 120 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలా.. 50 ఏళ్లుగా అదే పని