India Supports UN General Assembly: పాలస్తీనా సమస్యపై యూఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానం
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:44 AM
పాలస్తీనా సమస్యకు ‘న్యూయార్క్ డిక్లరేషన్’ను ఆమోదించడం.. రెండు దేశాల ఏర్పాటు ద్వారానే శాంతియుత పరిష్కారం లభిస్తుందన్న..
అనుకూలంగా భారత్ ఓటు
ఐక్యరాజ్యసమితి, సెప్టెంబరు 12 : పాలస్తీనా సమస్యకు ‘న్యూయార్క్ డిక్లరేషన్’ను ఆమోదించడం.. రెండు దేశాల ఏర్పాటు ద్వారానే శాంతియుత పరిష్కారం లభిస్తుందన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి అనుకూలంగా భారత్ శుక్రవారం ఓటు వేసింది. ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 142 దేశాలు ఓటు వేశాయి. 10 దేశాలు వ్యతిరేకించగా.. 12 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, హంగరీ, అర్జెంటీనా తదితర దేశాలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. కాగా ఐక్యరాజ్య సమితి హెడ్‌క్వార్టర్స్‌లో ఫ్రాన్స్, సౌదీ అరేబియా ఆధ్వర్యంలో జూలైలో నిర్వహించిన ఉన్నత స్థాయి అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఈ ‘న్యూయార్క్ డిక్లరేషన్’ను ప్రవేశ పెట్టారు. గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని అందులో పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య నెలకొన్న వివాదాలకు న్యాయమైన, శాంతియుత పరిష్కారం చూపేందుకు రెండు దేశాల ఏర్పాటు తప్పనిసరి అని స్పష్టం చేశారు.