Faizan Zakey: హైదరాబాద్ కుర్రాడు.. స్పెల్లింగ్ బీ విజేత
ABN , Publish Date - May 31 , 2025 | 05:54 AM
ఈ ఏడాది 100వ ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’లో హైదరాబాద్ మూలాలున్న 13 ఏళ్ల ఫైజాన్ జాకీ విజేతగా నిలిచాడు. క్లిష్టమైన పదాన్ని సరిగా ఉచ్చరించి టైటిల్ గెలుచుకున్న ఫైజాన్‌కు $50,000 నగదు బహుమతి లభించింది.
పతిష్ఠాత్మక పురస్కారాన్ని గెల్చుకున్న ఫైజాన్ జాకీ
అమెరికాలో ఏడో తరగతి విద్యార్థి
న్యూయార్క్, మే 30: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ‘స్ర్కిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ చాంపియన్‌షి్‌పను హైదరాబాద్ మూలాలున్న 13 ఏళ్ల భారతీయ అమెరికన్ కుర్రాడు ఫైజాన్ జాకీ గెల్చుకున్నాడు. ్ఛఛిజ్చూజీటఛిజీటట్ఛఝ్ఛుఽ్ట అనే పదంలోని అక్షరాలను సరిగా చెప్పటంతో ఫైజాన్ విజేతగా నిలిచాడు. అస్పష్టంగా ఉన్న దానిని పరిష్కరించటం, జ్ఞానోదయం కలిగించటం అని ఈ పదానికి ఉన్న అర్థం. గురువారం రాత్రి అమెరికాలోని మేరీలాండ్‌లో జరిగిన స్పెల్లింగ్ బీ కార్యక్రమం ప్రత్యక్షప్రసారాన్ని ఫైజాన్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి వీక్షించారు. ఫైజాన్ అమెరికాలోని సీఎం రైస్ మిడిల్ స్కూల్ ఏడో తరగతి విద్యార్థి. ఇప్పటి వరకూ నాలుగుసార్లు స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొన్న ఫైజాన్.. గత ఏడాది రెండోస్థానంలో నిలిచాడు. ఈసారి చివరిదైన 21వ రౌండ్‌లో ముగ్గురితో పోటీ పడి గెలుపును సొంతం చేసుకున్నాడు. కాగా, 1925లో ప్రారంభమైన స్పెల్లింగ్ బీ పోటీకి ఇది 100వ సంవత్సరం కావటం విశేషం. తరచూ భారతీయఅమెరికన్ విద్యార్థులే స్పెల్లింగ్ బీ చాంపియన్‌షి్‌పను గెల్చుకుంటున్నారు. విజేతలకు 50వేల డాలర్ల నగదు, మెడల్, ట్రోఫీని అందిస్తున్నారు.