Share News

David Szalay won Booker Prize: హంగేరియన్‌ బ్రిటీష్‌ రచయిత డేవిడ్‌ సలోయ్‌కు బుకర్‌ ప్రైజ్‌

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:26 AM

హంగేరియన్‌ బ్రిటీష్‌ రచయిత డేవిడ్‌ సలోయ్‌ 51 ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ 2025 విజేతగా నిలిచారు. ఆయన రాసిన నవల...

David Szalay won Booker Prize: హంగేరియన్‌ బ్రిటీష్‌ రచయిత డేవిడ్‌ సలోయ్‌కు బుకర్‌ ప్రైజ్‌

లండన్‌, నవంబరు 11 : హంగేరియన్‌ బ్రిటీష్‌ రచయిత డేవిడ్‌ సలోయ్‌(51) ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌-2025 విజేతగా నిలిచారు. ఆయన రాసిన నవల ‘ఫ్లెష్‌’కుగాను ఈ పురస్కారాన్ని ప్రకటించారు. భారతీయ రచయిత కిరణ్‌ దేశాయి తన రచన ‘ది లోన్లీనెస్‌ ఆఫ్‌ సోనియా అండ్‌ సన్నీ’తో సలోయ్‌తో బుకర్‌ ప్రైజ్‌కు చివరి వరకు పోటీ పడ్డారు. అయితే విజయం సలోయ్‌ను వరించింది. దీంతో సలోయ్‌కు సోమవారం రాత్రి నిర్వహించిన ఒక కార్యక్రమంలో గత ఏడాది బుకర్‌ ప్రైజ్‌ విజేత సమంత హార్వే 50,000 పౌండ్లతోపాటు ట్రోఫీ అందజేశారు. కిరణ్‌ దేశాయి 2006లో తన రచన ‘ద ఇన్‌హెరిటెన్స్‌ ఆఫ్‌ లాస్‌’కుగాను బుకర్‌ ప్రైజ్‌ అందుకున్నారు.

Updated Date - Nov 12 , 2025 | 02:27 AM