Donald Trump Peace Plan: ట్రంప్ ప్లాన్‌కు తల ఊపం
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:02 AM
గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాల ప్రణాళికను హమాస్ యథాతథంగా ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రత్యేక పాలస్తీనా..
సవరణలు ఉండాలి
హమా్‌సలో అంతర్గతంగా చర్చలు
దోహా, అక్టోబరు 1: గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాల ప్రణాళికను హమాస్ యథాతథంగా ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుపై స్పష్టమైన హామీ లేకపోవడం, ఇతరత్రా అభ్యంతరాలు ఉండడంతో ప్రణాళికలో సవరణలు అవసరం ఉంటుందని భావిస్తోంది. మూడు నాలుగు రోజుల్లో తన ప్రణాళికను ఆమోదించాలని, ఒకవేళ తిరస్కరిస్తే ‘విషాదకర ముగింపు’ ఉంటుందని మంగళవారం ట్రంప్ తుది హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో అదే రోజు హమాస్ నేతలు ఖతార్, తుర్కియే, ఈజిప్టు అధికారులతో సమాలోచనలు జరిపారు. ‘ఆయుఽధాలను విడిచిపెట్టడంతో పాటు హమాస్, ఇతర చీలిక వర్గాలను పూర్తిగా బహిష్కరించాలి’ అన్న ప్రతిపాదనపై అభ్యంతరం చెప్పారు. గాజా స్ట్రిప్ నుంచి ఇజాయ్రెల్ పూర్తిగా తొలగిపోయేలా అంతర్జాతీయ హామీలు ఉండాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై మరింతగా చర్చలు జరపాల్సిన అవసరం ఉందని మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ బుధవారం కూడా గాజాపై దాడులు చేసింది. దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది.