Share News

US Embassy: హెచ్‌1బీ వీసా కోసంమోసగాళ్ల వలలో పడకండి

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:41 AM

అమెరికా హెచ్‌1బీ వీసా అప్పాయింట్మెంట్లు, జారీలో ఏర్పడిన అసాధారణ జాప్యాన్ని మోసగాళ్లు తమకు అనువుగా మార్చుకుంటున్నారు.

US Embassy: హెచ్‌1బీ వీసా కోసంమోసగాళ్ల వలలో పడకండి

  • దరఖాస్తుదారులను హెచ్చరించిన యూఎస్‌ ఎంబసీ

న్యూఢిల్లీ, డిసెంబరు 27: అమెరికా హెచ్‌1బీ వీసా అప్పాయింట్మెంట్లు, జారీలో ఏర్పడిన అసాధారణ జాప్యాన్ని మోసగాళ్లు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. హెచ్‌1బీ వీసా చార్జీలకు అదనంగా కమిషన్‌ చెల్లిస్తే అప్పాయింట్మెంట్లు త్వరగా ఇప్పిస్తామని, వీసా గ్యారంటీ అంటూ దరఖాస్తుదారులకు వల వేస్తున్నారు. దీనిపై ఇండియాలోని యూఎస్‌ ఎంబసీ ఎక్స్‌ వేదికగా ఒక వీడియో సందేశం పోస్టు చేసింది. ‘మాయమాటలు నమ్మి మోసగాళ్ల వలలో చిక్కుకోకండి. నమ్మి ఆర్థికంగా నష్టపోకండి. వీసా ప్రక్రియను ఎవరూ ప్రభావితం చేయలేరు. అధికారిక వెబ్‌సైట్‌WWW.ustraveldocs.com లో మాత్రమే మీ వీసా కోసం దరఖాస్తు చేసుకోండి. సమాచారం కోసం కూడా ఇతర అధికారిక వెబ్‌ సెట్లు travel.state.gov, in.usembassy.gov/visas లను మాత్రమే అనుసరించండి. వీసా దరఖాస్తుదారులు సహనంతో వ్యవహరించాలి’ అని యూఎస్‌ ఎంబసీ సూచించింది.

Updated Date - Dec 28 , 2025 | 06:43 AM