Gunmen Open Fire on Pub: దక్షిణాఫ్రికాలో పబ్‌పై కాల్పులు
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:38 AM
దక్షిణాఫ్రికాలోని ఓ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని సాయుధుల బృందం జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించగా...
9 మంది మృతి.. 10 మందికి గాయాలు
జోహెన్నె్‌సబర్గ్, డిసెంబరు 21: దక్షిణాఫ్రికాలోని ఓ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని సాయుధుల బృందం జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించగా, పది మందికి గాయాలయ్యాయి. మృతుల్లో క్యాబ్ సర్వీసు కారు డ్రైవర్ కూడా ఉన్నారు. ఈ ఘటన రాజధాని జోహెన్నె్‌సబర్గ్‌కు పశ్చిమాన 46 కి.మీ దూరంలోని బెక్‌స్ర్డాల్ పట్టణంలోని పబ్ వద్ద చోటు చేసుకుంది. గత 3 వారాల్లో దక్షిణాఫ్రికాలో జరిగిన రెండో ఘటన ఇది. సుమారు 12 మంది సాయుధులు ఒక మినీ బస్సు, ఒక కారులో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. రోడ్లపై వెళుతున్న పాదచారులపైనా సాయుధులు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం తీవ్ర గాలింపు చేపట్టారు.