Share News

Military Volunteer System: ఫ్రాన్స్‌లో ఇక మిలటరీ వాలంటీర్లు

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:04 AM

ఫ్రాన్స్‌లో ఇక నుంచి మిలటరీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురానున్నట్టు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ వెల్లడించారు. యూరోప్‌...

Military Volunteer System: ఫ్రాన్స్‌లో ఇక మిలటరీ వాలంటీర్లు

  • 18-19 ఏళ్ల యువత సైన్యంలో 10 నెలల పాటు పనిచేయాలి

వర్సేస్‌, నవంబరు 27: ఫ్రాన్స్‌లో ఇక నుంచి మిలటరీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురానున్నట్టు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ వెల్లడించారు. యూరోప్‌ దేశాలకు రష్యా నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఫ్రాన్స్‌ సైన్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువత సైన్యంలో చేరి, 10 నెలల పాటు పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. మిలటరీ యూనిఫారం ధరించి ప్రధాన భూ భాగంలోనూ, ఫ్రాన్స్‌ ఆధీనంలోని ఇతర ప్రాంతాల్లోనూ పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. విదేశాల్లో నిర్వహించే మిలటరీ ఆపరేషన్లకు మాత్రం పంపించబోమని స్పష్టం చేశారు. వర్సేస్‌ మిలటరీ బేస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వచ్చే ఏడాది వేసవిలో ఈ నూతన జాతీయ సేవా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దాన్ని క్రమేణా విస్తరిస్తామని తెలిపారు. తొలుత వచ్చే ఏడాది 3,000 మందిని వాలంటీర్లుగా తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Nov 28 , 2025 | 04:04 AM