Fire incident: వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం..16మంది మృతి
ABN , Publish Date - Dec 30 , 2025 | 03:52 AM
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సులవేసీ ద్వీపంలోని ఓ వృద్ధాశ్రమంలో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ...
జకార్తా, డిసెంబరు 29: ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సులవేసీ ద్వీపంలోని ఓ వృద్ధాశ్రమంలో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 16మంది వృద్ధులు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:30గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. రాత్రి సమయం కావడంతో వృద్ధులంతా తమ గదుల్లో నిద్రిస్తున్నారని, మంటలు వేగంగా వ్యాపించడంతో చాలామంది బయటకు రాలేక అక్కడికక్కడే మృతి చెందారని అధికారులు తెలిపారు. అధికారులు, స్థానికులు సకాలంలో స్పందించి 12మందిని బయటకు తీసుకురాగలిగారు.