CJI Gavai: మన రాజ్యాంగాన్ని చూస్తే గర్వంగా ఉంది
ABN , Publish Date - Sep 11 , 2025 | 03:43 AM
నేపాల్‌లో ఆందోళనలు, హింసాత్మక ఘటనలపై సీజేఐ జస్టిస్ గవాయ్ స్పందించారు. బిల్లులను గవర్నర్లు ఆమోదించడం..
నేపాల్‌లో పరిస్థితులను ప్రస్తావిస్తూ
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: నేపాల్‌లో ఆందోళనలు, హింసాత్మక ఘటనలపై సీజేఐ జస్టిస్ గవాయ్ స్పందించారు. బిల్లులను గవర్నర్లు ఆమోదించడం, ఇందుకు కాలపరిమితి విధింపునకు సంబంధించిన అంశంపై బుధవారం విచారణ జరుగుతుండగా ఆయన నేపాల్‌లో అందోళలను ప్రస్తావించారు. ‘‘పొరుగుదేశాల్లో పరిస్థితులను చూడండి. నేపాల్‌లో ఏం జరుగుతుందో గమనించండి. వాటిని చూస్తుంటే మన రాజ్యాంగం గొప్పతనం అర్థం అవుతుంది. రాజ్యాంగం పట్ల గర్వంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. గతంలో బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ప్రస్తుతం నేపాల్‌లో పరిస్థితులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.