Bomb Strike: పెన్షన్ కోసం లైన్‌లో ఉన్న వృద్ధులపై రష్యా గ్లైడ్ బాంబు
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:28 AM
ఉక్రెయిన్‌లో ఘోరం జరిగింది. మంగళవారం రష్యా ప్రయోగించిన గ్లైడ్ బాంబ్ ఒకటి డోనెస్క్ ప్రాంతంలోని యరోవా గ్రామంలో..
21మంది మృతి.. 30మందికి గాయాలు
కీవ్, సెప్టెంబరు 9: ఉక్రెయిన్‌లో ఘోరం జరిగింది. మంగళవారం రష్యా ప్రయోగించిన గ్లైడ్ బాంబ్ ఒకటి డోనెస్క్ ప్రాంతంలోని యరోవా గ్రామంలో పెన్షన్ కోసం లైన్‌లో నిల్చున్న వృద్ధులపై పడింది. ఈ ఘటనలో 21మంది చనిపోయారు. దాదాపు 30మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యా చర్యను తీవ్రంగా ఖండించారు. రష్యా దారుణాలపై ప్రపంచం మౌనంగా ఉండొద్దని కోరారు. మరిన్ని ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 12వేల కంటే ఎక్కువ మంది సాధారణ పౌరులు మరణించినట్లు ఆయన వెల్లడించారు.