Share News

Crossdresser Filming 1600 Men: వీడు మామూలోడు కాదు.. ఆడవేషంలో 1600 మంది మగాళ్లను..

ABN , Publish Date - Jul 12 , 2025 | 08:14 AM

Crossdresser Filming 1600 Men: ఆ వీడియోలు, ఫొటోల్లో ఉన్నవారి కుటుంబసభ్యులు, మిత్రులు వాటిని చూశారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది కాపురాలు కూలిపోయాయి. దీంతో జియావో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Crossdresser Filming 1600 Men: వీడు మామూలోడు కాదు.. ఆడవేషంలో 1600 మంది మగాళ్లను..
Crossdresser Filming 1000 Men

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి ఆడవేషంలో మగాళ్లను దారుణంగా మోసం చేశాడు. వారి ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అమ్మేశాడు. అలా వంద కాదు రెండొందలు కాదు.. ఏకంగా 1600 మందిపైనే మగాళ్లను మోసం చేశాడు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పు చైనా, జియాగ్సు ప్రావిన్స్‌లోని నంజియాంగ్ సిటీకి చెందిన జియావో అనే వ్యక్తి ఈజీ మనీ కోసం మోసాలకు తెరతీశాడు. ఆడవేషం వేసి ఆన్‌లైన్ ద్వారా మగాళ్లను ఆకర్షించేవాడు.


వారిని తన రూముకు రప్పించుకునే వాడు. ఆ రూములో సీక్రెట్ కెమెరా ఉండేది. వాళ్లు రాగానే సీక్రెట్ కెమెరా ఆన్ చేసే వాడు. సీక్రెట్ కెమెరాలో రికార్డు అయిన వీడియోలను ఆన్‌లైన్ ద్వారా అమ్మేవాడు. అలా 1,691 మంది మగాళ్ల వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్మాడు. ఒక వీడియోకు 150 యాన్లు తీసుకునేవాడు. ఇండియన్ కరెన్సీలో అయితే దాదాపు రూ.1700 వసూలు చేసేవాడు. కొంతమంది ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబోలో వైరల్‌గా మారాయి.


ఆ వీడియోలు, ఫొటోల్లో ఉన్నవారి కుటుంబసభ్యులు, మిత్రులు వాటిని చూశారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది కాపురాలు కూలిపోయాయి. దీంతో జియావో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జియావోను పక్కా ప్లాన్ వేసి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అతడు పెద్ద జాదూ అని తేలింది. తను మగాడన్న సంగతి బయటకు తెలీకుండా ఉండేందుకు మాస్కు, శరీరానికి ఎక్కువ మొత్తంలో మేకప్, విగ్గు, లాంగ్ స్కర్ట్ వేసుకునేవాడు. జియావో తన దగ్గరకు వచ్చే మగాళ్ల నుంచి డబ్బులు తీసుకునేవాడు కాదు. చిన్న చిన్న గిఫ్ట్‌లు మాత్రం తీసుకురమ్మనే వాడు. జియావో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతడు మగాడని కొంతమంది గుర్తించే వారు. అతడ్ని బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు.


ఇవి కూడా చదవండి

విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

Updated Date - Jul 12 , 2025 | 12:00 PM