Share News

Economic Partnership: చైనా మార్కెట్లలో భారత్‌కు స్వాగతం

ABN , Publish Date - Aug 22 , 2025 | 06:51 AM

ట్రంప్‌ సుంకాల నేపథ్యంలో భారత్‌కు చైనా అండగా నిలిచింది. ఇప్పటికే వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని భారత్‌-రష్యా నిర్ణయించగా..

Economic Partnership: చైనా మార్కెట్లలో భారత్‌కు స్వాగతం

  • భారత్‌పై ట్రంప్‌ 50శాతం సుంకాలు దారుణం

  • చైనా రాయబారి ఫేయ్‌హోంగ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ట్రంప్‌ సుంకాల నేపథ్యంలో భారత్‌కు చైనా అండగా నిలిచింది. ఇప్పటికే వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని భారత్‌-రష్యా నిర్ణయించగా.. ఇప్పుడు చైనా కూడా తమ మార్కెట్లలోకి భారత్‌కు స్వాగ తం పలికింది. భారత్‌లోని చైనా రాయబారి షూ ఫేయ్‌హోంగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫేయ్‌హోంగ్‌.. భారత్‌పై అమెరికా 50ు సుంకాలను విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సుంకాలు దారుణమన్నారు. ‘‘భారత్‌-చైనా ఇప్పుడు పరస్పర అనుమానాస్పద ధోరణిని వీడి.. వ్యూహాత్మక విశ్వాసాన్ని నెలకొల్పాలి. అభివృద్ధి వ్యూహాలను పెపొందించుకోవాలి. ఇరుదేశాలు శత్రువుల్లా కాకుండా.. భాగస్వాముల్లా పనిచేయాలి. ఇరుదేశాల మధ్య ఉన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లో ఉత్పత్తి అయ్యే నిత్యావసరాల కోసం చైనా మార్కెట్ల తలుపులను తెరుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ చైనా పర్యటన గురించి విలేకరులు ప్రస్తావించగా.. షాంగై సహకార సంస్థ(ఎ్‌ససీవో) శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో మోదీ పర్యటనకు తాము ప్రాధాన్యతనిస్తున్న ట్లు తెలిపారు. ఆసియాలోనే చైనా, భారత్‌ డబుల్‌ ఇంజన్‌ ఆర్థిక వ్యవస్థలు గా ఉన్నాయని, ఇరు దేశాల ఐక్యత ప్రపంచానికి లబ్ధి చేకూరుస్తుందన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 07:01 AM