Share News

Lawrence Bishnoi: లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా ఉగ్రవాద సంస్థ: కెనడా

ABN , Publish Date - Sep 30 , 2025 | 03:45 AM

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రకటించింది. భారత్‌తో పాటు విదేశాల్లో హత్యలు, దోపిడీలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల...

Lawrence Bishnoi: లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా ఉగ్రవాద సంస్థ: కెనడా

అట్టావా, సెప్టెంబరు 29: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రకటించింది. భారత్‌తో పాటు విదేశాల్లో హత్యలు, దోపిడీలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాల నేపథ్యంలో దేశ క్రిమినల్‌ కోడ్‌ ప్రకారం ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తున్నట్లు కెనడా మంత్రి గ్యారీ ఆనందసంగరీ తెలిపారు. దీని ప్రకారం కెనడాలో ఉన్న బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఆస్తులను, నగదును, వాహనాలను ప్రభుత్వం స్వాధీనం లేదా స్థంభింపచేయవచ్చు. గ్యాంగ్‌ సభ్యులను కెనడా లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ చేయవచ్చు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యులను కెనడాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు. మార్క్‌ కెర్నీ కెనడా ప్రధాని అయ్యాక భారత్‌-కెనడా మధ్య మెరుగవుతున్న సంబంధాలకు తాజా చర్యను ఉదాహరణగా పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 03:45 AM