Share News

Bangladesh Protesters: రక్తపాతం తప్పదు!

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:55 AM

బంగ్లాదేశ్‌లో భారత వీసా కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఖుల్నా, రాజ్‌షాహి వీసా కేంద్రాల వైపు దూసుకుపోయేందుకు యత్నించారు

Bangladesh Protesters: రక్తపాతం తప్పదు!

  • భారత్‌కు బంగ్లా ఆందోళనకారుల బెదిరింపులు

ఢాకా, న్యూఢిల్లీ, డిసెంబరు 18: బంగ్లాదేశ్‌లో భారత వీసా కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఖుల్నా, రాజ్‌షాహి వీసా కేంద్రాల వైపు దూసుకుపోయేందుకు యత్నించారు. రక్తపాతం తప్పదంటూ భారత్‌ను హెచ్చరించారు. కత్తులు దూస్తామని, అవసరమైతే ఆయుధాలు పడతామని హెచ్చరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బంగ్లాదేశ్‌లో ఉన్న ఐదు వీసా కేంద్రాల్లో ఖుల్నా, రాజ్‌షాహి వీసా కేంద్రాలను మూసివేస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది. అంతకుముందు బుధవారం రాజధాని ఢాకాలో భారత హైకమిషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో భద్రతా కారణాల దృష్ట్యా వీసా కేంద్రాన్ని భారత్‌ మూసి వేసింది. గురువారం ఢాకాలోని వీసా కేంద్రాన్ని తిరిగి ప్రారంభించింది.

Updated Date - Dec 19 , 2025 | 03:55 AM