Share News

Anand Varadarajan: స్టార్‌బక్స్‌ సీటీవోగా ఆనంద్‌ వరదరాజన్‌

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:34 AM

అమెరికాలో భారత సంతతికి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ ఆనంద్‌ వరదరాజన్‌ స్టార్‌బక్స్‌ సంస్థ చీఫ్‌....

Anand Varadarajan: స్టార్‌బక్స్‌ సీటీవోగా ఆనంద్‌ వరదరాజన్‌

హూస్టన్‌, డిసెంబరు 22 : అమెరికాలో భారత సంతతికి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ ఆనంద్‌ వరదరాజన్‌ స్టార్‌బక్స్‌ సంస్థ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీవో), ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా అమెజాన్‌ గ్లోబల్‌ టెక్నాలజీ ఆపరేషన్లను నిర్వహిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 19న ఆయన స్టార్‌బక్స్‌లో బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ కార్యనిర్వాహక బృందంలో చేరనున్న ఆయన సీఈవో బ్రయన్‌ నికోల్‌కు నేరుగా రిపోర్ట్‌ చేస్తారని పేర్కొంది.

Updated Date - Dec 23 , 2025 | 03:35 AM