Share News

3 Indians Abducted: మాలీలో దారుణం.. భారతీయుల్ని అపహరించిన టెర్రరిస్టులు

ABN , Publish Date - Jul 03 , 2025 | 10:26 AM

3 Indians Abducted: ఈ సంఘటనపై భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారిని క్షేమంగా విడిపించాలని మాలీ ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. బమకోలోని భారత ఎంబసీ అధికారులు స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నారు.

3 Indians Abducted: మాలీలో దారుణం.. భారతీయుల్ని అపహరించిన టెర్రరిస్టులు
3 Indians Abducted

మాలీ దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పశ్చిమ, మధ్య మాలీలోని పలు మిలటరీ, ప్రభుత్వ స్థావరాలపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే కయెస్‌లోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆయుధాలతో బెదిరించి ముగ్గురు భారతీయుల్ని ఎత్తుకెళ్లిపోయారు. అల్ ఖైదాతో సంబంధాలు ఉన్న జమాత్ నుశ్రత్ అల్ ముస్లిమిన్ (JNIM) ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.


అపహరించిన ముగ్గురు భారతీయుల్ని ఎక్కడికి తీసుకెళ్లారు?.. ఏం చేశారు? అన్నది తెలియరాలేదు. స్థానిక ప్రభుత్వం వారిని క్షేమంగా తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇక, ఈ సంఘటనపై భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారిని క్షేమంగా విడిపించాలని మాలీ ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. బమకోలోని భారత ఎంబసీ అధికారులు స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.


ఈ సంఘటనపై మాలీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో..‘జులై 1వ తేదీన పశ్చిమ, మధ్య మాలీలోని పలు మిలటరీ, ప్రభుత్వ స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ విషయం భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ దారుణాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అపహరణకు గురైన వారిని క్షేమంగా విడిపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సీనియర్ మిలటరీ అధికారులు పరిస్థితులను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు. ఆ ముగ్గురు భారతీయుల్ని వీలైనంత త్వరగా.. క్షేమంగా ఉగ్రవాదుల చెరనుంచి విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

మలేషియాలో మామూలుగా ఉండదు.. వేడి వేడి చెప్పుల ఫ్రై రెడీ..

కొడుకును ఆడపిల్లలా అలంకరించి.. ఏం జరిగిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Updated Date - Jul 03 , 2025 | 10:28 AM