Share News

French Fries Diabetes Risk: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌తో మధుమేహం ముప్పు!

ABN , Publish Date - Aug 08 , 2025 | 05:23 AM

వారానికి మూడు సార్లు బంగాళాదుంపలతో చేసిన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం 20% పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

French Fries Diabetes Risk: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌తో మధుమేహం ముప్పు!

  • వారానికి మూడు సార్లు తింటే వ్యాధి బారిన పడే ప్రమాదం 20 శాతం ఎక్కువ

న్యూఢిల్లీ, ఆగస్టు 7: వారానికి మూడు సార్లు బంగాళాదుంపలతో చేసిన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం 20% పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఉడికించిన లేదా కాల్చిన బంగాళాదుంపలతో అంత ప్రమాదం ఉండదని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. హార్వర్డ్‌, కేంబ్రిడ్జి యూనివర్సిటీల పరిశోధకులు ప్రారంభంలో మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్‌ లేని దాదాపు 2 లక్షల మంది నుంచి 40 ఏళ్లపాటు సేకరించిన డేటాను విశ్లేషించారు. ఈ క్రమంలో 40 ఏళ్ల తర్వాత వారిలో 22,300 మంది డయాబెటిస్‌ బారినపడినట్టు గుర్తించారు.


వారానికి మూడుసార్లు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తీసుకున్న వారిలో మధుమేహం ప్రమాదం 20ు పెరిగిందని గుర్తించినట్టు వెల్లడించారు. అయితే కాల్చిన లేదా ఉడికించిన బంగాళాదుంపలు తీసుకున్న వారికి ఎలాంటి సమస్యా ఎదురు కాలేదని పేర్కొన్నారు. బంగాళాదుంపల స్థానంలో తృణధాన్యాలను ఆహారంగా ఇచ్చినప్పుడు మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గినట్టు కనుగొన్నారు. కానీ.. బంగాళాదుంపలకు బదులుగా అన్నం తీసుకున్నవారిలో మధుమేహం ప్రమాదం పెరిగినట్టు గుర్తించారు.

Updated Date - Aug 08 , 2025 | 05:23 AM