Literary Award: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పురస్కారం
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:19 AM
2025వ సంవత్సరానికి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం ప్రముఖ కవి విన్నకోట రవి శంకర్‌కి ఇస్తు న్నాం
2025వ సంవత్సరానికి ‘ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం’ ప్రముఖ కవి విన్నకోట రవి శంకర్‌కి ఇస్తు న్నాం.2020లో ప్రారంభమైన ఈ పురస్కారానికి రవి శంకర్ ఆరవ గ్రహీత. అవార్డు ప్రదానోత్సవ తేదీ, వేదికల వివరాలను త్వరలో తెలియజేస్తాం.
-పురస్కార కమిటీ
ముంజూరు కళింగాంధ్ర కవితా వార్షిక
సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో ‘ముంజూరు’ కళింగాంధ్ర కవితా వార్షిక 2024 గ్రంథాన్ని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం హరిపురం గ్రామంలో జులై 18న ఆవిష్కరించనున్నారు. నల్లి ధర్మారావు, దుప్పల రవికుమార్, వినోద్ కుత్తుం, సాంబమూర్తి లండ తదితరులు పాల్గొంటారు.
-వివరాలకు: 99892 65444.
సిక్కోలు బుక్స్
‘కున్నెమ్మ, మరికొన్ని కథలు’
రాజాం రచయితల వేదిక 126వ సాహిత్య సభ జూలై 20న శ్రీవిద్యానికేతన్ పాఠశాల, రాజాం, విజయనగరం జిల్లాలో జరుగుతుంది. ఈ సభలో ప్రొ.కాశీం ‘స మాజం–సాహిత్యం–సాంస్కృతిక చైతన్యం’ అంశంపై ఉపన్యాసం ఇస్తారు. ఇదే సభలో బాలసుధాకర్ మౌళి కథా సంపుటి ‘కున్నెమ్మ – మరికొన్ని కథలు’ పుస్తకాన్ని గార రవిప్రసాద్, గార సూర్య శైలజ ఆవిష్కరిస్తారు. సభలో అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు పాల్గొంటారు.
-పిల్లా తిరుపతిరావు
చోడగిరి చంద్రరావు కవిత్వం
కోయి కోటేశ్వరరావు సంపాదకత్వం వహించిన ‘భీమకవి’ చోడగిరిచంద్రరావు సమగ్ర కవిత్వం ఆవిష్కరణ సభ జూలై 20 ఉ.10 గంటలకు యూ.టి.ఎఫ్ బిల్డింగ్, కాకినాడలో జరుగుతుంది. అధ్యక్షత నేలపూడి బాలరాజు, ఆవిష్కర్త పొనుగుమట్ల విష్ణుమూర్తి, ముఖ్య అతిథి కోరుకొండ బాబ్జీ, విశిష్ట అతిథులు శిఖామణి, జి లక్ష్మీనరసయ్య, చోడగిరి లలితాదేవి, బండి సత్యనారాయణ, కొబ్బరాకు సుధాకర్, అద్దేపల్లి ప్రభు, మాకివీడి సూర్యభాస్కర్ తదితరులు.
-సవిలే రాజేష్
‘ప్రణామం’ కవి సమ్మేళనం
మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో ‘ప్రణామం’ కవి సమ్మేళనం జులై 20ఉ.10 గంటలకు విజయవాడ బందర్ రోడ్డులో అంబేడ్కర్ స్మృతివనం ఆవరణలో జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కవి సమ్మేళనంలో పాల్గొనే కవులు భాష, సామాజిక న్యాయం, దేశభక్తి, శాంతి, పర్యావరణం అంశాలపై తమ కవితల్ని వినిపిస్తారు.
-వివరాలకు 92464 15150.
కలిమిశ్రీ
‘విరిజల్లులు’ కార్టూన్ల సంకలనం
విశాలాక్షి సాహిత్య మాసపత్రిక నిర్వహించిన జాతీయ స్థాయి కార్టూన్ పోటీలలో వచ్చిన కార్టూన్లతో రూపొందించిన ‘విరిజల్లులు’ కార్టూన్ సంకలనం ఆవిష్కరణ జూలై 20న నెల్లూరు టౌన్ హాల్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త మండలి బుద్ధప్రసాద్. ఇదే సభలో వివిధ రంగాలలో సాహితీ కృషి చేస్తున్న జీవి పూర్ణచంద్, సంధ్యా శర్మ, ఆత్మకూరు రామకృష్ణ, శ్రీనాథ్ రెడ్డి, వడలి రాధాకృష్ణ, రాయసం దామోదర్‌లను విశాలాక్షి పురస్కారాలతో సత్కరిస్తారు.
-ఈతకోట సుబ్బారావు