Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 17 11 2025

ABN , Publish Date - Nov 17 , 2025 | 05:14 AM

రెండు రోజుల సాహిత్య ఉత్సవం, సప్పా ఎక్స్‌లెన్స్‌ అవార్డు, తిరుమల రామచంద్రపై ప్రసంగం, గురజాడ విశిష్ట పురస్కారం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 17 11 2025

రెండు రోజుల సాహిత్య ఉత్సవం

మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ నిర్వహణలో నవంబరు 22, 23 తేదీల్లో ఉ.9 నుండి రా.9గం.లవరకు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యఅతిథి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ. కందుల దుర్గేష్ ప్రారంభిస్తారు. మండలి బుద్ధప్రసాద్. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, పాపినేని శివశంకర్, డి. మునిరత్నం నాయుడు, ఆర్.డి. విల్సన్ అతిథులుగా వస్తారు. జి. లక్ష్మీనరసయ్య, ఖాదర్ మొహియుద్దీన్, చల్లపల్లి స్వరూపరాణి, జి.వి. రత్నాకర్ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 92464 15150.

కలిమిశ్రీ

సప్పా ఎక్స్‌లెన్స్‌ అవార్డు

నాట్య గురువు సప్పా దుర్గా ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఏటా ఇచ్చే సప్పా ఎక్స్‌లెన్స్ అవార్డు 2025 కోసం సాహిత్య విభాగంలో శిఖామణి ఎంపిక అయ్యారు. నవంబర్ 23 ఉదయం రాజమహేంద్రవరంలో అవార్డుల ప్రదాన సభ ఉంటుంది. ఈ అవార్డుకు సంగీత, సాహిత్య, కళా, సామాజిక తదితర రంగాలలో వంశీ రామరాజు, ఆర్. మల్లికార్జున రావు, పొత్తూరి సుబ్బారావు, హేమసుందర్ ఎంపికయ్యారు.

నటరాజ నృత్య నికేతనం

తిరుమల రామచంద్రపై ప్రసంగం

రాజాం రచయితల వేదిక 130వ సమావేశం నవంబరు 23 ఉ.10గంటల నుంచి విజయనగరం జిల్లా, రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠశాలలో జరుగుతుంది. సమావేశంలో ‘హంపి నుండి హరప్పా దాకా – తిరుమల రామచంద్ర జీవన పోరాటం’ అంశంపై పొట్నూరు కోటిబాబు ప్రసంగిస్తారు. అధ్యక్షత నల్ల రవికుమార్‌. వివరాలకు: 98857 58123.

గార రంగనాథం

గురజాడ విశిష్ట పురస్కారం

గురజాడ సాంస్కృతిక సమాఖ్య సంస్థ, విజయనగరం శాఖ నిర్వహించిన కవితల పోటీలో విజేతలుగా నిలిచిన ఐదుగురు: పోతూరి సీతారామరాజు, గంగవరపు సునీత, మహమ్మద్ అప్సర వలిషా, ఇనపకుర్తి చినసత్యనారాయణ, చళ్లపిళ్ల శ్యామల. నవంబర్ 30న జరిగే సభలో వీరికి న్యాయమూర్తి మానవేంద్ర రాయ్ చేతుల మీదుగా రెండువేల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేయబడతాయి. ఈ ఏడాది గురజాడ విశిష్ట పురస్కారాన్ని కొలకలూరి ఇనాక్ స్వీకరిస్తారు.

ఎం. వెంకటేశ్వరరావు

ఎమ్మెస్సార్ కథల పోటీ

మలిశెట్టి సీతారామ్ స్మారకార్థం నిర్వహిస్తున్న కథల పోటీకి ఔత్సాహిక రచయితల నుండి కథలకు ఆహ్వానం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3 వేలు, రూ.2వేలు. ఎంపిక చేసిన కథలతో ‘కథా ప్రపంచం 2025’ పుస్తకం వస్తుంది. కథల పోటీ వివరాలకు ఫోన్‌: 93947 82540, వాట్సాప్‌: 9985013234. కథలను నవంబరు 30లోపు ఈమెయిల్‌: msrtelugusahityam@gmail.comకు పంపాలి. అలాగే ఒక సీనియర్ సాహితీవేత్తకు మలిశెట్టి సీతారామ్ స్మారక జీవన సాఫల్య సాహితీ పురస్కారం (రూ.11,116/–), మరొక సాహితీవేత్తకు మలిశెట్టి సీతారామ్ స్మారక వార్షిక సాహితీ పురస్కారం (రూ.10వేలు) అందజేస్తాం.

మలిశెట్టి శ్యాం ప్రసాద్


కవిత్వ సంపుటాలకు ఆహ్వానం

వట్టికోట ఆళ్వారు స్వామి సాహిత్య కళా పీఠం ఆధ్వర్యంలో తుల యాదయ్య స్మారక జాతీయ పురస్కారం 2025 కొరకు కవిత్వ సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. సాహిత్యకారులకు రూ.6116/– నగదుతో జీవన సాఫల్య పురస్కారంతోపాటు; 2024లో ప్రచురితమైన కవిత్వ సంపుటాలలో ఎంపికైన సంపుటికి రూ.5116/– నగదుతో పురస్కారం అందజేస్తాం. ప్రోత్సాహకంగా ఒక యువ కవి కవిత్వ సంపుటికి రూ.2116/– నగదుతో పురస్కారం ఇస్తాం. మీ కవిత్వ సంపుటాలను డిసెంబర్‌ 31లోగా చిరునామా: తుల శ్రీనివాస్ ఇం.నెం: 12–107/ఎ, సంతోష్ నగర్, నకిరేకల్, నల్లగొండ, తెలంగాణ – 508 211కు పంపాలి. మరిన్ని వివరాలకు: 99485 25853

తుల శ్రీనివాస్‌

ఉమ్మడిశెట్టి అవార్డు

ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు పరిశీలనకు కవులు 2025లో ప్రచురితమైన తమ కవితా సంపుటాలు నాలుగు ప్రతులను జనవరి 10, 2026లోపు చిరునామా: రాధేయ, చైర్మన్, ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్, అనంతపురం – 515001, ఫోన్‌ – 9985171411కు పంపాలి. ఎంపికైన కవితా సంపుటికి రూ.6వేల నగదు బహుమతితోపాటు, కవికి షీల్డ్‌తో సన్మానం ఉంటుంది.

రాధేయ

ధీరజ్‌కోట్ల పురస్కారాలు

ధీరజ్‌కోట్ల పురస్కారాలు–2025లో ఎమ్బీఎస్ ప్రసాద్ ‘వశీకరణం’ కథా సంపుటి రూ.10000 ప్రథమ బహుమతికి ఎంపికైంది. రూ. 1,116 ద్వితీయ బహుమతులకి పాలగిరి విశ్వప్రసాద్, స్వరాజ్య పద్మజ, మునిసురేష్ పిళ్లె, దేశరాజు, బి.మురళీధర్, వెల్చేరు చంద్ర శేఖర్, గొర్తి వాణి శ్రీనివాస్‌ల కథా సంపుటాలు ఎంపికయ్యాయి. విశిష్ట పురస్కారానికి టిఎస్ఏ కృష్ణమూర్తి; యువ రచయిత పుర స్కారానికి దొండపాటి కృష్ణ, బాల సాహిత్య పురస్కారానికి వాసుకి నూచెర్ల, ఆత్మీయ పురస్కారానికి కేతు పద్మమ్మ ఎంపికయ్యారు.

పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్‌ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..

KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్‌.. రేపు విచారణ

Updated Date - Nov 17 , 2025 | 05:14 AM