Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 3 03 2025

ABN , Publish Date - Mar 03 , 2025 | 12:36 AM

‘కవిత 2024’కు ఆహ్వానం, కవిసంధ్య కవితల పోటీ ఫలితాలు, ఉమ్మడిశెట్టి అవార్డులు, కవితా సంకలనాలకు ఆహ్వానం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 3 03 2025

‘కవిత 2024’కు ఆహ్వానం

విజయవాడ ‘సాహితీమిత్రులు’ వెలువరిస్తున్న ‘కవిత 2024’ కోసం జనవరి 2024 నుంచి డిసెంబర్ 2024 మధ్య కాలంలో ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచురి తమైన కవితలను మార్చి 15 లోగా editor.kavitha2024@gmail.comకు పంపాలి. వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో పెట్టిన కవితలు అర్హమైనవి కాదు. పత్రికలలో ప్రచు రితమైన కవితల ఇమేజ్/ పిడిఎఫ్‌లు మాత్రమే పంపాలి.

విశ్వేశ్వరరావు

కవిసంధ్య కవితల పోటీ ఫలితాలు

కవి సంధ్య, యానాం – చిన్ని నారాయణ రావు ఫౌండేషన్, నెల్లూరు సంయుక్తంగా నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులకు వరుసగా– జడా సుబ్బారావు (నూజివీడు), పర్కపల్లి యా దగిరి (సిద్దిపేట), ఐలేని గిరి (దుబ్బాక) ఎంపికయ్యారు. ప్రోత్సా హక బహుమతులకు ఎంపికైనవారు: వినోద్ గుత్తుల, మోకా రత్న రాజు, జె.డి. వరలక్ష్మి, కళా గోపాల్, బి. వే ణు గోపాలరెడ్డి, పొనుగు మట్ల అశోక్ కుమార్, బి.వి. శివప్రసాద్, పిన్నంశెట్టి కిషన్, తుమ్మల దేవ్ రావ్, ఉదారి నారాయణ. మార్చి 23న బహుమతి ప్రదానం ఉంటుంది.

దాట్ల దేవదానం రాజు


ఉమ్మడిశెట్టి అవార్డులు

ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్, అనంతపురం ప్రకటించిన ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు – 2024 కోసం ‘రెండు ప్రపంచాల మధ్య’ కవితా సం పుటికి గాను కవయిత్రి వైష్ణవిశ్రీ ఎంపికయ్యారు. ఉమ్మ డిశెట్టి సతీష్ కుమార్ యువ పురస్కా రం – 2025 కోసం కవి నంద కిషోర్ ఎంపికయ్యారు. తర్వలో అవార్డు ప్రదానం జరుగుతుంది.

రాధేయ

కవితా సంకలనాలకు ఆహ్వానం

జాతీయ సాహిత్య పరిషత్, కరీంనగర్ ఆధ్వర్యంలో రజనిశ్రీ సాహిత్య పురస్కారానికి జనవరి 2022 నుంచి డిసెంబర్ 2024 మధ్య కాలంలో ముద్రితమైన పద్య, గేయ, వచన కవితల సంకలనాలు మాత్రమే నాలుగు ప్రతులను మార్చి 20లోగా పంపాలి. ప్రశంసా పత్రం, శాలువాతో పాటు రూ.10,116/– నగదు బహుమతి ఉంటుంది. చిరునామా: గాజుల రవీందర్, ఇం.నెం.: 8–3–255/1, రామచంద్రాపూర్ కాలనీ, రోడ్ నంబర్ 12, భగత్ నగర్, కరీంనగర్ – 505001. ఫోన్‌: 9848255525.

జి.వి. శ్యాంప్రసాద్ లాల్


Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..

Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..

Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా

Updated Date - Mar 03 , 2025 | 12:37 AM