Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 24 02 2025

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:46 AM

మఖ్దూమ్ మొహియుద్దీన్ పురస్కారం, మాడభూషి రంగాచార్య కథా పురస్కారం, కొలకలూరి పురస్కారాలు, ‘తడి ఆరని వాక్యమొకటి’ కవితా సంపుటి, కథానికల పోటీ, కథా సంపుటాలకు ఆహ్వానం, ‘నేల తడుముతూనే’ కవితా సంపుటి..

ఈ వారం వివిధ కార్యక్రమాలు 24 02 2025

మఖ్దూమ్ మొహియుద్దీన్ పురస్కారం

సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారం (2025) ప్రదానోత్సవ సభ ఫిబ్రవరి 24 ఉ.11గంటలకు హైదరాబాద్‌ లోని ప్రభుత్వ సిటీ కళాశాల ఆజామ్ హాల్లో జరుగుతుంది. పురస్కార స్వీకర్త నలిమెల భాస్కర్. అధ్యక్షత పి. బాలభాస్కర్, ముఖ్య అతిథి వెలుదండ నిత్యానందరావు, అతిథులు దేవులపల్లి అమర్, యాకూబ్, అన్నవరం దేవేందర్.

కోయి కోటేశ్వర రావు

మాడభూషి రంగాచార్య కథా పురస్కారం

మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారానికి పి. శ్రీనివాస్ గౌడ్ ‘మార్జినోళ్ళు’ కథా సంపుటి ఎంపిక అయ్యింది. పురస్కార ప్రదాన సభ ఫిబ్రవరి 25 సా.5.-30గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షులు సుధామ, ముఖ్య అతిథి విహారి, పుస్తక పరిచయం నాళేశ్వరం శంకరం. ముగ్గురు సీనియర్ రచయిత్రుల కథా విశ్లేషణ సంకలనం ‘నేటి కాలపు మేటి రచయితలు’ పుస్తకావిష్కరణ కూడా ఉంటుంది.

మాడభూషి లలితాదేవి


కొలకలూరి పురస్కారాలు

కొలకలూరి సాహిత్య పురస్కారాల ప్రదానం కార్యక్రమం ఫిబ్రవరి 26 సా.6గంటలకు ఎన్‌టిఆర్‌ ప్రాంగణం, తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. జూకంటి జగన్నాథం, టేకు మళ్ళ వెంకటప్పయ్య, గడ్డం మోహనరావు పురస్కారాలు స్వీకరిస్తారు. ముఖ్యఅతిథి డి. మాణిక్య వరప్రసాద్‌, అధ్యక్షత కొలకలూరి మధుజ్యోతి, విశిష్ట అతిథి కొలకలూరి సుమకిరణ్‌. పి.వాసు, ఎ. అనురాధ, యం. సుబ్బరాజు పరిశోధన సన్మానం అందుకుంటారు.

కొలకలూరి ఇనాక్‌

‘తడి ఆరని వాక్యమొకటి’ కవితా సంపుటి

సుధామురళి తొలి కవిత్వ సంపుటి ‘తడి ఆరని వాక్యమొకటి’ ఆవిష్కరణ మార్చ్ 2 ఉ.10గంటలకు నెల్లూరు టౌన్ హాల్‌లో జరుగుతుంది. ప్రసేన్, విమల, ముక్కామల చక్రధర్, శ్రీరామ్ పుప్పాల, గోపాల్ సుంకర, పెరుగు రామకృష్ణ, ఈతకోట సుబ్బారావు ప్రసంగిస్తారు.

ముక్కామల చక్రధర్‌


కథానికల పోటీ

భూపతి చంద్ర స్మారక సంస్థ నిర్వహిస్తున్న కథానికల పోటీకు సమకాలీన సామాజిక సమస్యలను ప్రతిబింబించే ఇతివృత్తాలతో, సున్నితమైన వ్యంగ్య, హాస్యాలతో కూడిన కథానికలను పంపాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు. ఐదు ప్రోత్సాహక బహుమతులు ఒకొక్కరికి రూ.1,000. కథానికలను మార్చ్‌ 10లోగా చిరునామా: సమన్వయకర్త, ‘భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటి, ఆనంద నిలయం, ఇం.నం. 1–5–1020/4, బి.ఆర్. రావు నగర్, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్ – 500010కు పంపాలి. వివరాలకు ఫోన్‌: 9963616999.

ఎమ్.ఎల్. కాంతారావు

కథా సంపుటాలకు ఆహ్వానం

‘వెన్నెల సాహితీ పురస్కారం– 2024’ కోసం 2023, 2024 సంవత్సరాలలో ప్రచురించిన కథా సంపుటాలు నాలుగు కాపీలను మార్చ్‌ 31లోగా పంపాల్సిన చిరునామా: పర్కపెల్లి యాదగిరి, ఇం.నెం.17-–3–-86/35, జ్యోతి నిలయం, వినాయక్ నగర్ రోడ్ -2, సిద్ధిపేట – 502103. వివరాలకు ఫోన్‌: 9299909516. సిద్దిపేటలో జరుగు కార్యక్రమంలో నగదు పురస్కారం అందుతుంది.

వెన్నెల సాహితీ సంగమం


‘నేల తడుముతూనే’ కవితా సంపుటి

తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు – తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గుండెల్లి ఇస్తారి కవితా సంపుటి ‘నేల తడుముతూనే’ ఆవిష్కరణ మార్చ్‌ 2 ఉ.10గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త నందిని సిధారెడ్డి, అధ్యక్షత కందుకూరి శ్రీరాములు, విశిష్ట అతిథి నాళేశ్వరం శంకరం, ఆత్మీయ అతిథులు రూప్ కుమార్ డబ్బికార్, కొండపల్లి నీహారిణి, ధూళిపాళ అరుణ, బెల్లంకొండ సంపత్ కుమార్.

కందుకూరి శ్రీరాములు


For Telangana News And Telugu News

Updated Date - Feb 24 , 2025 | 12:46 AM