Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 20 01 2025

ABN , Publish Date - Jan 20 , 2025 | 12:22 AM

కవితా సంపుటాలకు ఆహ్వానం, వుప్పల నరసింహం యాది...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 20 01 2025

కవితా సంపుటాలకు ఆహ్వానం

పాలమూరు సాహితీ అవార్డుల కోసం 2024 సంవత్సరంలో ముద్రి తమైన వచన కవితా సంపు టాలు మూడేసి ప్రతులను జనవరి 31 లోగా చిరునామా: భీంపల్లి శ్రీకాంత్, ఇం.నం. 8-5-38, టీచర్స్ కాలని, మహ బూబ్ నగర్ – 509001కు పంపాలి. ఉత్తమ వచన కవితా సంపుటికి రూ.5,116/– నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు. వివరాలకు: 90328 44017.

భీంపల్లి శ్రీకాంత్‌

వుప్పల నరసింహం యాది

జర్నలిస్ట్‌, రచయిత వుప్పల నరసింహం యాదిలో సభ జనవరి 21 మ.2గంటలకు బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్, సురవరం ప్రతాప రెడ్డి ఆడిటోరియం, 1వ అంతస్తు, నిజాం కాలేజీ ఎదురుగా, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభాధ్యక్షులు వుప్పల బాలరాజు. జయధీర్ తిరుమలరావు, బి.ఎస్. రాములు, ఆడెపు లక్ష్మీపతి, కవి యాకూబ్, సంగిశెట్టి శ్రీనివాస్, తుమ్మలపల్లి రఘురాములు, శంకర నారా యణ, అనిల్ అట్లూరి, కె.పి. అశోక్‌ కుమార్‌, జంపాల ప్రవీణ్‌ తదితరులు ప్రసంగిస్తారు.

వనపట్ల సుబ్బయ్య

Updated Date - Jan 20 , 2025 | 12:22 AM