Share News

Telugu Language Priority: అమరావతిలో భవనాలపై తెలుగు అక్షరాలుండాలి

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:10 AM

అమరావతి నగరంలో శరవేగంగా నిర్మాణాలు జరగడం ఆనందకరం. సీఆర్‌డీఏ భవనం మీద ఆంగ్ల అక్షరం ‘ఏ’ను నిలబెట్టారు. శిలాఫలకాలూ...

Telugu Language Priority: అమరావతిలో భవనాలపై తెలుగు అక్షరాలుండాలి

అమరావతి నగరంలో శరవేగంగా నిర్మాణాలు జరగడం ఆనందకరం. సీఆర్‌డీఏ భవనం మీద ఆంగ్ల అక్షరం ‘ఏ’ను నిలబెట్టారు. శిలాఫలకాలూ ఆంగ్లంలోనే ఉంటున్నాయి. ఇది తెలుగుదేశం. తెలుగువారి రాజధాని. ఇక్కడ నిర్మించబోయే ప్రభుత్వ, ప్రైవేటు భవనాల మీద తెలుగు అక్షరాల నామ ఫలకాలు ఉండాలి. తెలుగు లేకుండా కేవలం ఆంగ్ల అక్షరాలు మాత్రమే కొలువుదీరితే... భూములు ఇచ్చిన రైతులకే కాదు, ప్రతి ఆంధ్రుడికీ ‘ఇది మన రాజధాని’ అనే భావన, తృప్తి కలుగదు. మన పొరుగు రాష్ట్రాలవారు తమ మాతృభాషకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని కార్యాలయాల మీద వారి భాషనే ఉపయోగిస్తున్నారు. అమరావతిలోని ప్రతి కార్యాలయ నామఫలకం తెలుగులో ఉండాలి. అప్పుడే తెలుగుదేశం పేరు సార్థకం అవుతుంది.

సరస్వతుల

రామ నరసింహం(సరసి)

ఇవి కూడా చదవండి

5 బీసీ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమించిన ప్రభుత్వం

అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

Updated Date - Nov 27 , 2025 | 01:16 AM