AP BC Welfare Appointments: 5 బీసీ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమించిన ప్రభుత్వం
ABN , Publish Date - Nov 26 , 2025 | 08:52 PM
5 బీసీ కులాల సంక్షేమ, అభివృద్ధి కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఛైర్ పర్సన్‌లు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది
అమరావతి: 5 బీసీ కులాల సంక్షేమ, అభివృద్ధి కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ భట్రాజు సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్ పర్సన్‌గా సిరికొండ వెంకటేశ్వరరాజు నియమితులయ్యారు. ఏపీ పెరిక సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్ పర్సన్‌గా వనపర్తి వీరభద్రరావు నియమితులయ్యారు. ఏపీ షేక్ సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్ పర్సన్‌గా వడ్ల షేక్ ముక్తార్ నియమితులయ్యారు.
ఏపీ కుర్ని/కరికాల భక్తులు సంక్షేమం, అభివృద్ది కార్పోరేషన్ ఛైర్ పర్సన్‌గా కమర్తి మినప్ప.. ఏపీ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్ పర్సన్‌గా కొండా శంకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఛైర్ పర్సన్‌లు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది.
ఇవి కూడా చదవండి
అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్
వార్నీ.. ఈ కుర్రాడు మమూలోడు కాదు.. ఐ ఫోన్ బాక్స్‌ను ఎలా మార్చాడో చూడండి..