Share News

Telugu Poets and Writers: తెలంగాణ సాహిత్య కార్యక్రమాలు మరియు పుస్తక ఆవిష్కరణలు

ABN , Publish Date - May 19 , 2025 | 12:52 AM

ప్రఖ్యాత సాహిత్య కార్యక్రమాలు మరియు పుస్తక ఆవిష్కరణలు, కవితా సంపుటాలు, కథలు, సాహిత్య అవార్డులు వరుసగా జరుగుతున్నాయి. ‘గస్సాల్, మరికొన్ని కథలు’, ‘ఏకుదారం’ నవల, ‘దుఃఖం పండుతున్న నేల’ కవితా సంపుటి మరియు ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాల గురించి సమాచారం అందించడం జరిగింది.

Telugu Poets and Writers: తెలంగాణ సాహిత్య కార్యక్రమాలు మరియు పుస్తక ఆవిష్కరణలు

‘గస్సాల్, మరికొన్ని కథలు’

కె. ఆనందాచారి కథల సంపుటి ‘గస్సాల్, మరికొన్ని కథలు’ ఆవిష్కరణ మే 23 సా.5.30గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో పెద్దింటి అశోక్ కుమార్, ఏనుగు నర్సింహారెడ్డి, మామిడి హరికృష్ణ, వేముల శ్రీనివాస్, ప్రసేన్, నామోజు బాలాచారి, మువ్వా శ్రీనివాసరావు, ఆర్. సీతారాం తదితరులు పాల్గొంటారు.

-తెలంగాణ సాహితి


‘ఏకుదారం’ నవల

బి. నాగశేషు నవల ‘ఏకుదారం’ ఆవిష్కరణ మే 24న తిరుపతి యూత్ హాస్టల్లో జరుగుతుంది. పుస్తక ఆవిష్కరణ పి.సి. వెంకటేశ్వర్లు, పుస్తక సమీక్ష కె. శ్రీనివాసులురెడ్డి, సభాధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథి వి.ఆర్ రాసాని, ఆత్మీయ అతిథులు వై. సుభాషిణి, బొమ్మిశెట్టి రమేష్. వివరాలకు 9393662821.

-ఆర్.సి. కృష్ణ స్వామి రాజు


కేంద్ర సాహిత్య అకాడమీ ‘కవి సంధి’

కేంద్ర సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో అన్నవరం దేవేందర్‌తో ‘కవి సంధి’ కార్యక్రమం మే 25 సా.6గంటలకు కరీంనగర్‌లోని ఫిల్మ్ భవన్ ఏసీ హాలులో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవేందర్ తన సాహిత్య జీవన యాత్రను వివరించి కవితా పఠనం చేస్తారు. కార్యక్రమ పర్యవేక్షణ: ప్రసేన్.

-మృణాళిని


‘దుఃఖం పండుతున్న నేల’ కవితా సంపుటి

కంఠ బంగార్రాజు కవితా సంపుటి ‘దుఃఖం పండుతున్న నేల’ ఆవిష్కరణ మే 25ఉ .10గం టలకు విజయవాడ–గవర్నర్ పేటలోని బాలోత్సవ్ భవన్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త గోరటి వెంకన్న. రసరాజు, బి. ప్రసాదమూర్తి, బిక్కి కృష్ణ, కోయి కోటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 92464 15150

-మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ


ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాలకు ఆహ్వానం

ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారాల కోసం కవిత సంపుటాలకు, కథలకు ఆహ్వానం. మూడు ఉత్తమ కథలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.25వేలు, రూ.15 వేలు, రూ.10వేలు. ఉత్తమ కవితా సంపుటికి రూ.40వేల బహుమతి. కవితా సంపుటి 2024 ఏప్రిల్ – 2025 మార్చ్ మధ్య ప్రచురితమై ఉండాలి. కనీసం 25 కవితలకు తగ్గకుండా ఉండాలి. కథలు ఈ పురస్కారం కోసమే రాసినవై ఉండాలి. కవితా సంపుటాలు నాలుగు ప్రతులు పంపాలి. కథల యూనికోడ్‌ టెక్స్‌ట్‌ను మెయిల్‌ పంపుతూ నాలుగు ప్రింట్‌ కాపీలు పోస్ట్‌ చేయాలి. చిరునామా: ఖమ్మం ఈస్థటిక్స్‌, హార్వెస్ట్‌ స్కూల్‌, 5-7–200/11, పాకబండ బజార్‌, ఖమ్మం– 507003. ఫోన్‌: 9849114369. ఈమెయిల్‌: khammamaesthetics@gmail.com

-రవి మారుత్

Updated Date - May 19 , 2025 | 12:52 AM