Reflections on Modern Politics: ఆధునిక రాజకీయాలపై వనం వ్యాస సంపుటి
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:53 AM
దేశ ప్రజాస్వామ్యం పైన, పాలన పైన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ మాజీ సీపీఆర్‌ఓ వనం జ్వాలా నరసింహారావు రాసిన ఇంగ్లీషు వ్యాసాల సంపుటి ‘డెమాక్రసీ అండ్ గవర్నెన్స్: త్రూ లెన్స్ అండ్ బ్లర్డ్ గ్లాసెస్’...
దేశ ప్రజాస్వామ్యం పైన, పాలన పైన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ మాజీ సీపీఆర్‌ఓ వనం జ్వాలా నరసింహారావు రాసిన ఇంగ్లీషు వ్యాసాల సంపుటి ‘డెమాక్రసీ అండ్ గవర్నెన్స్: త్రూ లెన్స్ అండ్ బ్లర్డ్ గ్లాసెస్’ ఆవిష్కరణ సభ డిసెంబరు 19 సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్, రోడ్ నంబర్ 10సి, జూబ్లీహిల్స్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ పుస్తకాన్ని ప్రజాస్వామ్యానికి డైరీగా, పాలనా విధానాలకు కరదీపికగా, నైతిక దిక్సూచీగా, పౌరులకు మార్గదర్శకంగా చూడవచ్చు. ఇందులోని 75 వ్యాసాలు పాఠకుడిని తక్షణ ఘటనల మీదుగా మరింత లోతైన పరిశీలనల వైపునకు తీసుకువెళ్తాయి. ప్రజాస్వామ్యం ఎలా పరస్పర వైరుధ్యాల మధ్య పని చేస్తుందో, సంక్షోభాల మధ్య ఎలా తనను తాను సరిదిద్దుకుంటుందో మనకు ఈ పుస్తకం విశదపరుస్తుంది. రచయిత క్షేత్ర స్థాయిలో తనకున్న విస్తృతానుభవాన్నీ, వివిధ వ్యవస్థలతో తనకున్న సన్నిహిత పరిచయాన్నీ ఆధారంగా చేసుకుని ప్రజాస్వామ్యం కేవలం ఒక రాజకీయ విధానం మాత్రమే కాదని, ఎన్నో సంక్లిష్టతలు, మరెన్నో అవకాశాలూ కలిగిన సజీవ స్రవంతి అనీ నిరూపిస్తారు. ప్రజాస్వామ్య శ్రేయస్సుకు ఎన్నికలొక్కటే సరిపోవనీ, పౌరుల ఉత్సాహవంతమైన ప్రాతినిధ్యం ఇందుకు ఎంతో కీలకమనీ ఈ పుస్తకం తేల్చి చెప్తుంది. ఈ పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ హాజరవుతారు. ప్రత్యేక అతిథులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ్‌రావు, తెలంగాణ జెన్‌కో–ట్రాన్స్‌కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, ప్రణీత్ గ్రూపు ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు, సినీ దర్శకుడు దేవ్‌కట్టా హాజరవుతారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పుస్తక సమీక్ష చేస్తారు.
మిహిర క్రియేటివ్స్
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?