లాస్యహేల
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:27 AM
సీ. హరినామస్మరణలో పరుగులు పెట్టేటి హరిదాసు దీవెనల్ హంగు గూర్చ! డూడూల బసవన్న డోలు సన్నాయితో రంగవల్లుల వీధి రంజిలంగ!...

సీ. హరినామస్మరణలో పరుగులు పెట్టేటి
హరిదాసు దీవెనల్ హంగు గూర్చ!
డూడూల బసవన్న డోలు సన్నాయితో
రంగవల్లుల వీధి రంజిలంగ!
ప్రొద్దుట సూరీడు పూలబాలలపైని
తుహినపు ముత్యాల రహిని గూర్చ!
అరిసెల కతనాన అమ్మలక్కలు జేయు
వరువాత రోకళ్ళ వాద్యఘోష!
తే. సస్య సిరులతో కర్షక లాస్యహేల
గొబ్బిపాటల వనితల కూజితాల
కొత్త అల్లుళ్ళ సందళ్ళు కూర్చువేళ
అరుగుదెంచెడి సంక్రాంతి స్వాగతమ్ము!
మోదుకూరు రాధాకృష్ణశర్మ