Share News

High Beam Headlights Danger: యాక్సిడెంట్లకు హెడ్‌లైట్లూ కారణమే

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:38 AM

దేశంలో నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటి ద్వారా ఏటా లక్షలాది మంది చనిపోవడమే కాకుండా ఎంతో మంది గాయపడుతున్నారు.

High Beam Headlights Danger: యాక్సిడెంట్లకు హెడ్‌లైట్లూ కారణమే

దేశంలో నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటి ద్వారా ఏటా లక్షలాది మంది చనిపోవడమే కాకుండా ఎంతో మంది గాయపడుతున్నారు. రాత్రి వేళల్లోనే ఈ ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయి. వీటికి కారణం అధిక వేగంతో వెళ్లే విదేశీ వాహనాలు, కళ్లపై అధిక ప్రభావంతో పడే హైబీమ్‌ లైటింగ్, తాగి వాహనాలు నడపటం... వంటివి. అభివృద్ధి చెందిన దేశాల్లో విశాలమైన రోడ్లు, తక్కువ జనాభా, ట్రాఫిక్‌ రూల్స్‌ను కచ్చితంగా పాటించడం వల్ల అక్కడ రోడ్డు ప్రమాదాలు తక్కువ. మన దగ్గర అలా కాదు. రోడ్డు భద్రత తక్కువ, ట్రాఫిక్ ఎక్కువ. ఒకప్పుడు స్వదేశీ అంబాసిడర్, మారుతి తరహా కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాల వంటి మోటారు వాహనాలు పరిమిత వేగంతో ప్రయాణించేవి. వాటి హెడ్లైట్లపై సగం నల్లరంగు వేయటమో, నల్ల స్టిక్కర్లు అంటించడమో చేసేవారు. ఫలితంగా కాంతి అన్ని వైపులా ప్రసరించకుండా ఎదుటి వాహనాలు స్పష్టంగా కనిపించేవి. కానీ ప్రస్తుతం అలాంటివేవీ పాటించడం లేదు. దీంతో ప్రస్తుత వాహనాల హైబీమ్‌ లైట్ల కాంతి నేరుగా ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లపై పడుతోంది. వారికి ఎదుటి వాహనాలు కన్పించకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తద్వారా ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎదుటి వాహనాలకు ఇబ్బంది లేని విధంగా లైటింగ్ ఏర్పాటు చేయాలని వాహన తయారీ కంపెనీలను కేంద్రం ఆదేశించాలి. రోడ్డు రవాణా, పోలీసు అధికారులు తమ బృందాలతో నిత్యం అప్రమత్తంగా ఉంటూ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి.

– తిరుమలశెట్టి సాంబశివరావు

Updated Date - Jul 12 , 2025 | 12:38 AM