‘బిరుదురాజు’ శతజయంతి సదస్సు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:00 AM
కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధి చెందిన ఆచార్య బిరుదురాజు రామరాజు తెలుగు సాహిత్యానికి చేసిన కృషి అనన్య సామాన్యమైనది. ఆయన జానపద సాహిత్యానికి...

కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధి చెందిన ఆచార్య బిరుదురాజు రామరాజు తెలుగు సాహిత్యానికి చేసిన కృషి అనన్య సామాన్యమైనది. ఆయన జానపద సాహిత్యానికి ఒక శాస్త్రీయమైన గుర్తింపు తీసుకువచ్చారు. ప్రాచీన సాహిత్యాన్ని నూతన కోణంలో ఆవిష్కరించారు. ఎంతోమంది విద్యార్థులను రచయితలుగా, విమర్శకులుగా తీర్చిదిద్దారు. ఆయన శతజయంతి సందర్భంగా ‘ఆచార్య బిరుదురాజు రామరాజు సాహితీ సమాలోచనం’ అనే పేరుతో రెండు రోజుల జాతీయ సదస్సును ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, తెలంగాణ ఉన్నత విద్యామండలి, తెలంగాణ భాష–సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 10, 11 తేదీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్ 133 ఆ సదస్సునకు వేదిక. ఆచార్య సాగి కమలాకరశర్మ–అధ్యక్షులుగా, డా. ఎస్.రఘు–కన్వీనర్‌గా, ప్రొఫెసర్ సి.కాశీం, డా. ఏలె విజయలక్ష్మి, డా. ఓ.కృష్ణయ్య, డా. వేల్పుల కుమారస్వామి, డా. ఇ. మహేందర్ సదస్సు నిర్వహణలో పాల్గొంటారు. సదస్సులో పరిశోధనపత్రాల సమర్పణతో పాటు తెలుగు సాహిత్యంలో రామరాజు పాత్ర, వారి సాహిత్యసేవపై ప్రసంగాలు ఉంటాయి.
– పల్లె సతీష్
ఈ వార్తలు కూడా చదవండి...
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
Read Latest Telangana News And Telugu News