నిబద్ధత కలిగిన నేత
ABN , Publish Date - May 14 , 2025 | 06:21 AM
బండారి రాజిరెడ్డి రాజకీయ నిబద్ధత కలిగిన గొప్ప నేత బండారి రాజిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో కాప్రా మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఆయన జీవితం మొదలైంది. అంచెలు అంచెలుగా ఎదిగి కాప్రా మున్సిపాలిటీకి తొలి చైర్మన్ అయ్యారు. అలాగే ఉప్పల్ నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మురికివాడలలో నివసిస్తున్న...
బండారి రాజిరెడ్డి రాజకీయ నిబద్ధత కలిగిన గొప్ప నేత బండారి రాజిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో కాప్రా మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఆయన జీవితం మొదలైంది. అంచెలు అంచెలుగా ఎదిగి కాప్రా మున్సిపాలిటీకి తొలి చైర్మన్ అయ్యారు. అలాగే ఉప్పల్ నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మురికివాడలలో నివసిస్తున్న పేద ప్రజల విషయంలో రాజిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయంలో వందలాది కోట్ల రూపాయల నిధులను ఉప్పల్ నియోజకవర్గానికి తీసుకువచ్చి ఇక్కడి అభివృద్ధికి బాటలు వేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లినా బండారి రాజిరెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజలు చెప్పుకుంటారు. రాజిరెడ్డి ఉదయం 6 గంటలకే ఇక్కడి కాలనీలలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకునేవారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేవారు. కుషాయిగూడ జమ్మిగడ్డలో ప్రజా వైద్యశాలను అందుబాటులోకి తీసుకురావడంలో రాజిరెడ్డి పాత్ర మరువలేనిది. కైలాసగిరి గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, మల్లికార్జునస్వామి దేవాలయం గోశాలను ఏర్పాటు చేశారు. సొంత నిధులతో దేవాలయాలను కట్టించారు. ఎంతోమంది యువతీ యువకులను రాజకీయాల వైపు మళ్ళించారు. పదవుల కోసం, డబ్బు కోసం పార్టీలు మారే ఎందరో నేతలను చూస్తాం. రాజిరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే మరణించారు.
దామరపల్లి నరసింహారెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..