Today Horoscope: ఈ రాశి వారు విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 02:13 AM
నేడు రాశిఫలాలు 20-8-2025 - బుధవారం, చిన్నారులు ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకలకు ఏర్పాట్లలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.
నేడు రాశిఫలాలు 20-8-2025 - బుధవారం, చిన్నారులు ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకలకు ఏర్పాట్లలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకలకు ఏర్పాట్లలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం ఆవేదన కలిగిస్తుంది. తోబుట్టువుల వైఖరి కారణంగా మనస్తాపానికి గురవుతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. డబ్బు విషయంలో సన్నిహితులు మొహమాట పెట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి బిల్లులు, చెక్కులు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదు. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
విదేశాల్లో చదువుకునేందుకు చేసే ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మనసు చికాకుగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి మనసు తేలికపడుతుంది. సమస్యల పరిష్కారానికి ఒక మార్గ దొరుకుతుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల వల్ల మనస్తాపానికి గురవుతారు. బృందకార్యక్రమాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. మధ్యాహ్నం తరువాత ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి, రాజకీయ, సినీ రంగల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో లక్ష్యాలు సాధించడం కష్టసాధ్యం. ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మధ్యాహ్నం తరువాత సమావేశాల్లో గౌరవ మన్ననలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలించకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. పెద్దలతో చర్చల సమయంలో జాగ్రతగా ఉండటం మంచిది. మధ్యాహ్నం నుంచి ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. గణపతి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలించకపోవచ్చు. మధ్యాహ్నం నుంచి రుణాల మంజూరు, పెట్టుబడుల విషయంలో పురోగతి కనిపిస్తుంది. పన్నులు, బీమా వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి, విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. మధ్యాహ్నం 2 గంటల తరువాత పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పూర్వ మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. కృషి రంగంలో లక్ష్య సాధనకు సన్నిహితుల నుంచి ఆటంకాలు ఎదురవుతాయి. మధ్యాహ్నం నుంచి పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. బందుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆడిటింగ్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. చిన్నారుల ఆరోగ్యం కలవరపెడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. గణపతిని ఆరాధించండి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ