Share News

Today Horoscope: ఈ రాశి వారు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:37 AM

నేడు 19-06-2025 గురువారం, మధ్యాహ్నం 12 గంటల వరకు వాగ్వివాదాలకు దూరంగా ఉండండి...

Today Horoscope: ఈ రాశి వారు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి

నేడు 18-06-2025 గురువారం, మధ్యాహ్నం 12 గంటల వరకు వాగ్వివాదాలకు దూరంగా ఉండండి.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం 12 గంటల వరకు వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. మధ్యాహ్నం తరువాత విద్యార్థులకు శుభప్రదం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. మార్కెటింగ్‌, వాణిజ్యం, కమ్యూనికేషన్‌ ర ంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దత్తకవచ పారాయణ శుభప్రదం.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్థిక విషయాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు అవసరమైన నిధుల సర్దుబాటు విషయంలో ఆటంకాలు తప్పకపోవచ్చు. మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో ఊహించని వ్యక్తుల నుంచి సహకారం లభిస్తుంది. ఎగుమతులు, రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం 12 గంటల వరకు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. కార్పొరేట్‌, యూనియన్‌ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం వరకు పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనవసరంగా మాటపడాల్సి వస్తుంది. మధ్యాహ్నం నుంచి లక్ష్య సాధనలో పైఅధికారుల సహకారం లభిస్తుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గోసేవ విజయ సాధనకు తోడ్పడుతుంది.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం వరకు ఆర్థికపరమైన సమావేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. మధ్యాహ్నం నుంచి రవాణా, బోధన, న్యాయ, ఆడిటింగ్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు.. దక్షిణామార్తి స్తోత్ర పారాయణ శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం వరకు పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్తిక విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పన్నులు, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకుంటారు. గోసేవ శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం వరకు భాగస్వామి వైఖరి కారణంగా మనస్తాపానికి గురవుతారు. వేడుకలు, సమావేశాల్లో అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం తరువాత శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. పెట్టుబడుల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. అనుబంధాలు బలపడతాయి. దత్తకవచ పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. దత్తకవచ పారాయణ శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం 12 గంటల వరకు పెట్టుబడులు, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారులు, ప్రియతమల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి సంతానం విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. స్పెక్యులేషన్లు, పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. గోసేవ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం 12 గంటల వరకు తల్లిదండ్రుల ఆరోగ్యం కలవరం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. మధ్యాహ్నం నుంచి కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన విషయాలు సన్నిహితులతో చర్చకు వస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం వరక విద్యార్థులు అశ్రద్ధ కారణంగా మాటపడాల్సి వస్తుంది. విద్యాసంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అలాంటి పనులను మధ్యాహ్నం తరువాతకు వాయిదా వేసుకోవడం మంచిది. మధ్యాహ్నం నుంచి ప్రయాణాలు చర్చలు అనందం కలిగిస్తాయి. చర్చలు ఫలిస్తాయి. దత్తకవచ పారాయణ శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం వరకు ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సకాలంలో నిధులు చేతికి అందకపోవ డంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. షిర్డి సాయినాధుని ఆరాధన శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jun 20 , 2025 | 04:02 AM