Share News

Today Horoscope: ఈ రాశి వారికి విలువైన వస్తువుల విషయాలో అప్రమత్తత అవసరం

ABN , Publish Date - Jul 03 , 2025 | 01:31 AM

నేడు 03-07-2025 గురువారం, సన్నిహితుల వైఖరి మనస్తాపానికి గురిచేస్తుంది. వేడుకల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది....

Today Horoscope: ఈ రాశి వారికి విలువైన వస్తువుల విషయాలో అప్రమత్తత అవసరం

నేడు 03-07-2025 గురువారం, సన్నిహితుల వైఖరి మనస్తాపానికి గురిచేస్తుంది. వేడుకల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల వైఖరి మనస్తాపానికి గురిచేస్తుంది. వేడుకల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. భాగస్వామి వైఖరి బాధిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది.. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో పొరపాట్లు కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి శుభవార్త అందుకుంటారు. సాయినాధుని ఆరాదన మేలు చేస్తుంది.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. క్రీడలు, ఆడిటింగ్‌, టెలివిజన్‌ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకకరంగా ఉంటుంది. అనుబంధాలు బలపడతాయి. లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశకు లోనవుతారు. కుటుంబ విషయాలో కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దక్షిణామూర్తి ఆరాధన మేలు చేస్తుంది.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

లక్ష్య సాధనలో విద్యార్థులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు పాటించండి. కీలక పత్రాలు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్‌లో నిదానం అవసరం. మధ్యాహ్నం తరువాత శుభవార్త అందుకుంటారు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. బృంద కార్యక్రమాలు కోసం ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం తరువాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. పెద్దలు, పై అధికారుల నుంచి మాటపడాల్సి రావచ్చు. కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేయడం మంచిది. మధ్యాహ్నం తరువాత పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్షీనరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంచనాలు ఫలించకపోవడంతో ఆందోళనకు గురవుతారు. సమావేశాలు, చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం తరువాత ఉన్నత విద్యా విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దత్తకవచ పారాయణ మంచిది.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఆశాభంగానికి గురవుతారు. రుణ బాధ పెరుగుతుంది. సన్నిహతుల రోగ్యం కలపవరపెడుతుంది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. విలువైన వస్తువుల విషయాలో అప్రమత్తత అవసరం. మధ్యాహ్నం తరువాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గాయత్రీ మాతను ఆరాధించండి.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో, బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. వివాహ నిర్ణయాల విషయంలో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. కీలక పదవుల విషయంలో ఆశాభంగం కలిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం తరువాత సన్నిహితుల సహకారంతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. షిర్డి సాయినాధుని ఆరాధన ఊరటనిస్తుంది.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. న్యాయ, బోధన, కళలు, రవాణా, రక్షణ రంగాల వారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మధ్యాహ్నం తనువాత పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల ఆరోగ్యం కలవరపెడుతుంది. బీమా, పన్నులు, పెన్షన్‌ వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. మధ్యాహ్నం తరువాత సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 03 , 2025 | 05:25 AM