Share News

Today Horoscope: ఈ రాశి వారు పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు

ABN , Publish Date - May 25 , 2025 | 12:20 AM

నేడు 25-05-2025 ఆదివారం, సన్నిహితుల నుంచి ఆర్థిక సహకారం అందుకుంటారు. ఫీజులు, బిల్లులు చెల్లించేందుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.

Today Horoscope: ఈ రాశి వారు పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు

నేడు 25-05-2025 ఆదివారం, సన్నిహితుల నుంచి ఆర్థిక సహకారం అందుకుంటారు. ఫీజులు, బిల్లులు చెల్లించేందుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల నుంచి ఆర్థిక సహకారం అందుకుంటారు. ఫీజులు, బిల్లులు చెల్లించేందుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల తోడ్పాటు లభిస్తుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కొత్త ఆలోచనలు అమలుచే సి అదనపు ఆదాయం అందుకుంటారు. వ్యక్తిగత అవసరాల కోసం వెచ్చిస్తారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. మధ్యాహ్నం తరువాత తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, దూరప్రయాణాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆందోళనల నుంచి ఊరట లభిస్తుంది. పరిష్కారం కాకుండా ఉన్న బాధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. యూనియన్‌ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.


MESHAM-05.jpg

సింహం (జూలై 24- ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా లాభిస్తుంది. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తల్లిదండ్రుల విషయాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు, న్యాయ, బోధన, రవానా, రక్షణ రంగాల వారు గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు. విద్యా విషయాలపై పెద్దలతో చర్చిస్తారు.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదపు పథకాలకు సంబంధించి చర్చలకు అనుకూలం. ప్రయాణాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఆరోగ్య బీమా, పన్నులకు సంబంధించిన చర్చలు లాభిస్తాయి. బృందకార్యక్రమాలు, వేడుకల కోసం ఖర్చు చేస్తారు.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వేడుకలు అవసరమైన నిధులు సమకూరతాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వైద్యం, హోటల్‌, ఆహార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రీడలు, ఆడిటింగ్‌, టీచింగ్‌, చిట్‌ఫండ్‌ రంగాల వారికి అనుకూలమైన రోజు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాదిస్తారు.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. చిన్నారులు, ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇంటి కోసం విలవైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.


MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఇంటికి అవసరమైన వస్తువుల రవాణాకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. తోబుట్టువులు, మిత్రులను కలుసుకుంటారు. విద్యకు సంబంధించిన విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - May 25 , 2025 | 12:20 AM