Share News

Today Horoscope: ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:36 AM

నేడు రాశిఫలాలు 13-07-2025 ఆదివారం, ఆర్థిక వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడులు లాభిస్తాయి...

Today Horoscope: ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు

నేడు రాశిఫలాలు 13-07-2025 ఆదివారం, ఆర్థిక వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడులు లాభిస్తాయి.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఇంట్లో వేడుకలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.


02 VRUSHABHAM.jpg

వృషభం ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

పెద్దలతో చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దలతో పనులు పూర్తవుతాయి. ఒక శుభవార్త అందుకుంటారు. సూర్యదేవుని ఆరాధన శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత చదువులు విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. న్యాయ, బోధన, ప్రచురణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బీమా, పన్నులు, పెన్షన్‌ వ్యవహారాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరమ్మతులు, హార్డ్‌వేర్‌ రంగాల వారికి అనుకూలమైన రోజు.


05 SIMHAM.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. న్యాయ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దుర్గామాతను ఆరాధించండి.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. క్రీడలు, విద్య, ఆడిటింగ్‌, టెలివిజన్‌ రంగాల వారు పెద్దల సహకారం అందుకుంటారు. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు ఆనుకూలం. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు సమావేశాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్‌మార్కెట్‌ లావాదేవీలకు అనుకూలం. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. దుర్గామాతను ఆరాధించండి.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలమైన రోజు.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

సినిమాలు, రాజకీయాలు, టెలివిజన్‌, ఎగుమతుల రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రచురణలు, ఆడిటింగ్‌ రంగాల వారికి అనుకూలమైన రోజు.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 13 , 2025 | 12:36 AM