Today Horoscope : ఈ రాశి వారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:26 AM
నేడు (25-01-2025-శనివారం) న్యాయ, బోధన, రవాణా, ప్రచురణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

నేడు (25-01-2025-శనివారం) న్యాయ, బోధన, రవాణా, ప్రచురణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
న్యాయ, బోధన, రవాణా, ప్రచురణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
పెద్దల ఆరోగ్యం మెరుగుడపుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో పెద్దల సహకారం తీసుకుంటారు. పన్నులు, బీమా వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. బోనస్‌లు అందుకుంటారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రదర్శనలు, సమావేశాల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం లభిస్తుంది. ఫార్మ, పరిశ్రమలు, హోటల్, సేవల రంగాల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
వివాహ నిర్ణయాలకు అనుకూలం. ప్రేమానుబంధాలు బలపడతాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు బహుమతులుగా అందుకుంటారు. క్రీడలు, టెలివిజన్, ఆడిటింగ్ రంగాల వారికి కొత్త పరిచయాలు లాభిస్తాయి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సిబ్బంది నియామకాలకు అనుకూలం. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కమ్యూనికేషన్లు, రవాణా, కాంట్రాక్టుల రంగాల వారికి ప్రోత్సాహకకరంగా ఉంటుంది. ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. శుభవార్త అందుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, ఫర్నిచర్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులకు సంబంధించిన ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
తోబుట్టువుల విషయంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కమ్యూనికేషన్లు, చర్చలు, రవాణా, బోధన రంగాల వారు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అవసరమైన రుణాలు మంజూరవుతాయి. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. ఆర్థిక సంస్థల సిబ్బందికి అనుకూల సమయం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఇంక్రిమెంట్లు, బోనస్‌లు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. గౌరవ ప్రతిష్ఠలు పెంపొందుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు,. వ్యాపారపరంగా కొత్త ఆలోచనలు చేస్తారు.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ