Today Horoscope: ఈ రాశి వారికి లక్ష్య సాధనలో తోబుట్టువుల సహకారం లభిస్తుంది
ABN , Publish Date - Jul 19 , 2025 | 02:43 AM
నేడు రాశిఫలాలు 19-7- 2025 - శనివారం, ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
రాశిఫలాలు 19-7- 2025 - శనివారం, ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఒక సమాచారం అనందం కలిగిస్తుంది. చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు. విద్యార్థులకు శుభప్రదం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. మార్కెటింగ్, వాణిజ్యం, కమ్యూనికేషన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
డబ్బుకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్, ప్రచురణలు, రాజకీయ, సినీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థిక విషయాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. కార్పొరేట్, యూనియన్ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ, సినీ రంగాల వారు సన్నిహితుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. లక్ష్య సాధనలో పైఅధికారుల సహకారం లభిస్తుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గోసేవ విజయ సాధనకు తోడ్పడుతుంది.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, చర్చలు సత్ఫలితాలనిస్తాయి. ఉన్నత విద్యకు అసవరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. రవాణా, బోధన, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు.. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పన్నులు, బీమా, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకుంటారు. గోసేవ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
కొత్త పరిచయాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. పెట్టుబడుల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. అనుబంధాలు బలపడతాయి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
వైద్యం, పరిశ్రమలు, హోటల్, వ్యవసాయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సంతానం విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. స్పెక్యులేషన్లు, పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన విషయాలు సన్నిహితులతో చర్చకు వస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. శ్రీ వేంకటే శ్వర స్వామిని ఆరాధించండి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. లక్ష్య సాధనలో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రయాణాలు చర్చలు అనందం కలిగిస్తాయి. చర్చలు ఫలిస్తాయి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ