Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి సంకల్పం నెరవేరుతుంది
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:13 AM
నేడు 28 10 2025 మంగళవారం, ఉద్యోగ, వ్యాపారారల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి....
నేడు 28-10-2025 - మంగళవారం, ఉద్యోగ, వ్యాపారారల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారారల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

వృషభం (ఏప్రిల్ 21- మే 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాల కారణంగా లబ్ధి పొందుతారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

మిథునం (మే 21 - జూన్ 21 మధ్య జన్మించిన వారు)
వైద్యం, పరిశ్రమలు, హోటల్, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. సంకల్పం నెరవేరుతుంది.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బదిలీల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పరిస్థితిని సమీక్షించుకుంటారు. వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులకు సంబంధించి ఆనందకరమైన సమాచారం అందుతుంది. క్రీడలు, ఆడిటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. అనుబంధాలు బలపడతాయి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. స్థిరాస్తి పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
మార్కెటింగ్ , రవాణా, టీచింగ్, కమ్యూనికేషన్ రంగాల వారు కీలకమై నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలమైన రోజు. శుభవార్త అందుకుంటారు. రవాణా, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులపూ మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త పనుల ప్రారంభానికి అనుకూలం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
దూరప్రాంతంలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎగుమతులు, టెక్స్‌టైల్స్, ప్రచురణల రంగాల వారికి లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా రంగాలకు చెందిన పెద్దలను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. యూనియన్ వ్యవహారాలు, బృందకార్యక్రమాలు, ప్రదర్శనలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఉన్నత విద్యకు నిధులు సర్దుబాటు అవుతాయి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ