Share News

Today Horoscope: ఈ రాశి వారు ఆడిటింగ్‌ ప్రకటనలు విద్యాసంస్థలు ఫైనాన్స్‌ కంపెనీల వారు ఆచితూచి వ్యవహరించాలి

ABN , Publish Date - Nov 19 , 2025 | 02:37 AM

నేడు రాశిఫలాలు 19-11- 2025 బుధవారం, ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. కష్టంలో ఉన్న బంధుమిత్రులను పరామర్శిస్తారు...

Today Horoscope: ఈ రాశి వారు ఆడిటింగ్‌ ప్రకటనలు విద్యాసంస్థలు ఫైనాన్స్‌ కంపెనీల వారు ఆచితూచి వ్యవహరించాలి

నేడు రాశిఫలాలు 19-11- 2025 బుధవారం, ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. కష్టంలో ఉన్న బంధుమిత్రులను పరామర్శిస్తారు.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. కష్టంలో ఉన్న బంధుమిత్రులను పరామర్శిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పన్నులు, బీమా వ్యవహారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామి వైఖరి ఆందోళన కలిగిస్తుంది. కొత్త పరిచయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. పందాలు, పోటీల్లో నిదానం పాటించండి. గోమాతను ఆరాధించండి.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆస్పత్రులు, హోటళ్లు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ప్రయోగాలకు తగిన సమయం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. సమావేశాలు, విందులకు ఖర్చులు అధికం. గణపతి స్తోత్ర పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆడిటింగ్‌, ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్‌ కంపెనీల వారు ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారులు, ప్రియతముల వైఖరి కలవరపెడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరాశకు లోనవుతారు. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభ ప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24- ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

గృహనిర్మాణ సామగ్రి, ఫర్నీచర్‌ రంగాల వారు, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారు నిదానం పాటించాలి. వసతి ఏర్పాట్లలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. గమనించాలి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. గోమాత ఆరాధన మేలు చేస్తుంది.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

రాతకోతలు, రిజిస్ట్రేషన్ల విషయంలో పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. మార్కెటింగ్‌, రవాణా, బోదన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. బ్యాంకులతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. అన్నదానం శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కీలక నిర్ణయాలకు ఈ రోజు అనుకూలం కాదు. అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. సంకల్ప సిద్ధికి అదనంగా శ్రమించాల్సి వస్తుంది. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

రాజకీయాలు, సినిమాలు, టెక్స్‌టైల్స్‌, కళల రంగాల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎగుమతులు, కన్సల్టెన్సీ ర ంగాల వారికి ప్రోత్సాహకరగా ఉంటుంది. లక్ష్య సాధనలో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. దూరప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. గోమాతను సేవించండి.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాలకు సంబంధించిన సమావేశాలు ఫలించకపోవచ్చు. వ్యాపారస్థులు తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. అన్నదానం శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం ( జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వ్యాపార రంగంలోని వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్దల సహకారం లోపించడంతో ఇబ్బంది పడతారు. సమావేశాల్లో గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అంచనాలు మించపోతాయి. శ్రీ రామ చంద్ర మూర్తి ఆరాధన. శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

మీ అంచనాలు ఫలించకపోవచ్చు. ప్రింటింగ్‌, టెలివిజన్‌, న్యాయం, బోధన, కన్సల్టెన్సీ, రవాణా, రక్షణ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం. బృందకార్యక్రమాల్లో ఖర్చులు అధికం. గణపతి ఆరాధన శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Nov 19 , 2025 | 02:38 AM