Today Horoscope: ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు
ABN , Publish Date - Sep 22 , 2025 | 01:33 AM
నేడూ 18-09-2025 సోమవారం, కొత్త పరిచయాల వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో లబ్ది పొందుతారు. వేడుకలు, విందు వినోదాల్లో పాల్గొంటారు...
నేడూ 18-09-2025 సోమవారం, కొత్త పరిచయాల వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో లబ్ది పొందుతారు. వేడుకలు, విందు వినోదాల్లో పాల్గొంటారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
కొత్త పరిచయాల వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో లబ్ది పొందుతారు. వేడుకలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాదిస్తారు. వైద్యం, హోటల్, ఫార్మా, కార్మిక రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి మంచి ఫలితాలు అందుకుంటారు. విందు, వినోదాలు ఆనందం కలిగిస్తాయి. పరమశివుని ఆరాధించండి.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతములు ఇల్లు చేరడంలో మనసు ఆహ్లాదంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు కోసం పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. విద్యార్థులకు వసతి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శ్రీ రుద్రాష్టక పారాయణ శుభప్రదం

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలమైన రోజు. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఫర్నీచర్, అలంకరణ సామగ్రి రవాణాకు అనుకూలం. తోబుట్లువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. స్తిరాస్థికి సంబంధించిన చర్చలు ఫలిస్తాయి.

సింహం (జూలై 24- ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
విలువైన పత్రాలు చేతికి అందుతాయి. ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల నుంచి సహకారం లభిస్తుంది. పెట్టుబడులు, రుణాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఒక సమాచారం అనందం కలిగిస్తుంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలు అమలు చేసి ఆదాయం పెంచుకుంటారు. రుణాలు, అడ్వాన్సులు మంజూరవుఆయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీరుద్ర కవచ పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, విదేశీ వాణిజ్యం అంశాలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆందోళనలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివాష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, ప్రదర్శనలు లాభిస్తాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన ప్రయాణాలు చర్చలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ప్రచురణ, రాజకీయ, సినీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శివాష్టక పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్ర మాల్లో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బోనస్‌లు, అడ్వాన్సులు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. రాజకీయ రంగంలోని వారికి పోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక వ్యూహం ప్రకారం నడుచుకుని విజయం సాధిస్తారు. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

కుంభం ( జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
పన్నులు, బీమా, పెన్షన్ వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. న్యాయ, బోధన, రవాణా, రక్షణ రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉన్నత విద్య, దూరప్రయాణాలకు అవసరమైన నిధులు అందుతాయి. రుణాలు మంజూరవుతాయి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు లభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ