Today Horoscope: ఈ రాశి వారు శ్రమకు తగిన ప్రతిఫలాలు అందుకుంటారు
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:10 AM
నేడు రాశిఫలాలు 14-07-2025 సోమవారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు...
నేడు రాశిఫలాలు 14-07-2025 సోమవారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు...

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. బృందకార్యక్రమాల్లో ఖర్చులు అధికం. పరమేశ్వరుడిని ఆరాధించండి.

వృషభం ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ప్రముఖులతో సమావేశాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ సంస్థల నుంచి కీలక పత్రాలు అందుకంటారు. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. నవగ్రహ ప్రదక్షిణలు చేయడం మంచిది.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు. న్యాయ పోరాటాలు ఫలిస్తాయి. బోధన, రవాణా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు తప్పే అవకాశం ఉంది. పరమశివుని ఆరాధించండి.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. వైద్యం, పరిశోధనలు, రిపేర్ల రంగాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం. పన్నుల వ్యవహారాలపై దృష్టి పెడతారు. మరమ్మతుల కోసం వెచ్చిస్తారు. వైద్య పరీక్షలకు అనుకూలం. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపాలి. శ్రీ రుద్ర కవచ పారాయణ మేల చేస్తుంది.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. గత అనుభవంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. శివ అష్టోత్తర శతనామపారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వ్యవసాయం, పరిశ్రమలు, ఔషధాలు, వినోద రంగాల వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలాలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి. నవగ్రహ ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ప్రేమానుబంధాలు బలడతాయి. చిన్నారులు విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. చిన్నారుల విషయంలో శ్రద్ధ చూపాలి శివారాధన శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులకు సంబంధించి అనుకూల సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇంటికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు అనుకూలం. డ్రైవింగ్‌లో జాగ్రత్త అవసరం. పరమశివుని సేవ శుభప్రదం.

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం అందుకుంటారు. చర్చలు ఫలిస్తాయి. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. స్టేషనరీ, రవాణా, టీచింగ్ రంగాల వారికి అనుకూలం. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఖర్చులు అధికం. శివపంచాక్షరీ స్మరణం శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సిబ్బంది నియామకాలకు అనుకూలమైన రోజు. సహోద్యోగుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త ప్రయోగాలకు అనుకూలం కాదు. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఎగుమతులు, టెక్స్‌టైల్స్, ఫొటోగ్రఫీ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. దూరంలో ఉన్న ప్రియతముల నుంచి ఆనందకరమైన సమాచారం అందుకుంటారు. మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. పరమశివుని ఆరాధించండి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ