Today Horoscope: ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:06 AM
నేడు రాశిఫలాలు 20-12- 2025 శనివారం, ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఉన్నత విద్యా విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి....
నేడు రాశిఫలాలు 20-12- 2025 శనివారం, ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఉన్నత విద్యా విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఉన్నత విద్యా విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. మధ్యాహ్నం నుంచి సమావేశాలు, చర్చలు ఫలిస్తాయి. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. రుణబాధలు ఇబ్బది పెడతాయి. మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పుల వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మహావిష్ణువును ఆరాధించండి.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నిదానం అవసరం. కొత ్త పరిచయాల వల్ల నష్టం వాటిల్లుతుంది. మధ్యాహ్నం నుంచి సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. గోమాత ఆరాధన శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పట్ల శద్ధ్ర చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. సహోద్యోగుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి పట్లుదలతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. శ్ర మకు తగిన ఫలితం లభిస్తుంది. శ్రీ వేంకట్వేర స్వామిని ఆరాధించండి.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పిల్లల వ్యవహారశైలి మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం క లిగిసాయి. మధ్యాహ్నం నుంచి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. గాయత్రీ మాతను ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు తగిన సమయం కాదు. మధ్యాహ్నం నుంచి చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకంటాయి. శ్రీవేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంల నాణ్యత పాటించాలి. మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో ఆశాంతి నెలకొంటుంది. వ్యక్తిగత విషయాల్లో అసౌకర్యానికి లోనవుతారు. మధ్యాహ్నం నుంచి మనసుకం కొంత ప్రశాంతత చేకూరుతుంది. కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

మకరం ( డిసెంబరు 22- జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఏదో తెలియని వెలితి మిమ్మల్ని బాధిస్తుంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురుకావడంతో ఆశాంతికి లోనవుతారు. మధ్యాహ్నం నుంచి కొంత ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు శాంతినిస్తాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

కుంభం ( జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. బృందకార్యక్రమాల్లో అనవసర బాధ్యతలు మోయాల్సి వస్తుంది. మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. మధ్యాహ్నం నుంచి ఉద్యోగ రంగంలోని వారు లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ